
Harish Rao : మూసీ ప్రాజెక్టులో ఇప్పటికే కూలగొట్టిన 300 ఇళ్ల వారికి రేవంత్ రెడ్డి ఏం ఇచ్చాడు అని ప్రశ్నించారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లలోకి పంపించి మమ అనిపించాడు. 2013 చట్టం ప్రకారం.. అన్ని వసతులు, సౌకర్యాలు కల్పిస్తూ, అమ్ముకునే శాశ్వత హక్కుతో కూడిన ఇల్లు కట్టించి, కుటుంబానికి దాదాపు రూ.15 లక్షల వరకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
What did Revanth Reddy give to the 300 houses that were demolished on the banks of Musi river
రేవంత్ రెడ్డి 300 మందిని మూడు దిక్కులా కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇల్లలోకి పంపించాడని పేర్కొన్నారు. మూసీ నదికి డీపీఆర్ ప్రిపేర్ అయిందా? ఉంటే ప్రజల ముందు పెట్టు అని ప్రశ్నించారు. ఒకవేళ డీపీఆర్ ప్రిపేర్ అవ్వకపోతే.. ప్రజల ఇళ్లు ఎందుకు కూలగొడుతున్నావు? అని నిలదీశారు.
Also Read : Musi Riverfront: ఆపరేషన్ మూసీ మాస్టర్ ప్లాన్ సిద్ధం.. 7000 కోట్లతో మొదటి దశ పనులు!!
డీపీఆర్ ఇవ్వడానికి 18 నెలలు పడుతుందని రేవంత్ రెడ్డి మొన్న జనవరిలో జరిగిన అసెంబ్లీలో చెప్పాడు. అయితే డీపీఆర్ రాకుండా 10,017 ఇళ్లు కూలుస్తానని ప్రజలకు నోటీసులు ఎలా ఇస్తావు? అని ప్రశ్నించారు. అక్కడ ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో బాంబులతో ఇండ్లు కూలిపోతుంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి బుల్డోజర్లతో ఇండ్లు కూల్చుతున్నాడు. పేదల మీద రేవంత్ రెడ్డి బుల్డోజర్లతో యుద్ధం చేసి 10,017 ఇండ్లు కూల్చుతున్నాడని పేర్కొన్నారు.
Also Read : Energy Security: గ్యాస్ కొరత సృష్టించే వారిపై మోడీ ఆగ్రహం.. ఇంధన భద్రతపై రాహుల్ ఆందోళన!!




















