
Wine Shop: తెలంగాణ రాష్ట్రం మరోసారి తాగుబోతుల రాష్ట్రమని నిరూపించుకున్నారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం వచ్చింది. చరిత్రలో తొలిసారి రూ.44 వేల కోట్ల ఆదాయం వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. Wine Shop
Wine Shop Huge revenue for Telangana Excise Department
గత ఏడాది ఎక్సైజ్ శాఖకు రూ.40, 209 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది 7% ఆదాయం పెరిగింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా, కేవలం ఒక్క డిసెంబర్ నెలలోనే రూ.5,051 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలిపారు అధికారులు. Wine Shop
Also Read: RS Praveen Kumar: రేవంత్ రెడ్డి అనేవాడు చంద్రబాబుకు ప్రాక్సీ ముఖ్యమంత్రి
మద్యం అమ్మకాల ద్వారా రూ.39,368 కోట్ల ఆదాయం వచ్చిన సంగతి తెలిసిందే. కేవలం కొత్త దుకాణాల దరఖాస్తులు, వైన్స్ మరియు బార్ల అద్దెతో రూ.5,189 కోట్ల ఆదాయం రావడం గమనార్హం. దీంతో 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.44,557 కోట్ల ఆదాయం వచ్చిందని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. Wine Shop
Also Read: Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు





