RS Praveen Kumar: రేవంత్ రెడ్డి అనేవాడు చంద్రబాబుకు ప్రాక్సీ ముఖ్యమంత్రి

RS Praveen Kumar Revanth Reddy is Chandrababu's proxy Chief Minister
RS Praveen Kumar Revanth Reddy is Chandrababu’s proxy Chief Minister

RS Praveen Kumar: రేవంత్ రెడ్డి అనేవాడు చంద్రబాబుకు ప్రాక్సీ ముఖ్యమంత్రి అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మేడిగడ్డలో పిల్లర్లు వాటంతట అవి కూలిపోలేదని.. వాటిని కుట్ర పూరితంగా కూల్చేశారని తెలిపారు. దాన్ని ఎందుకు రిపేర్ చేయడంలేదని వెల్ల‌డించారు. RS Praveen Kumar

RS Praveen Kumar Revanth Reddy is Chandrababu’s proxy Chief Minister

పోలవరం నుండి బనకచర్లకు నీళ్లు పోవాలంటే మేడిగడ్డ రిపేర్ అవ్వొద్దని, కావాలనే రిపేర్ చేయడం లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఒక ప్రాక్సీ ముఖ్యమంత్రిని చంద్రబాబు తెలంగాణలో పెట్టాడన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని గడ్డి మందు తాగితే కనీసం ఆ అమ్మాయిని ఆసుపత్రికి కూడా తీసుకుపోలేదని వెల్ల‌డించారు. RS Praveen Kumar

Also Read: BJP: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు…నిధులు స్వాహా చేసిన బీజేపీ జిల్లా ఇంచార్జ్‌లు

రెండు రోజుల తర్వాత ఆసుపత్రికి తీసుకుపోతే.. అప్పటికే ఆ అమ్మాయి కిడ్నీలు, ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయి ప్రాణాలు విడిచిందన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఇప్పటివరకి 127 మంది గురుకుల విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. RS Praveen Kumar

Also Read: KTR: ఎకరాకు రెండు కోట్ల లంచం అడిగిన మంత్రి పొంగులేటి ?

Share your love