
Kaushik Reddy: హుజురాబాద్ గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రోజుకో వివాదంలో చిక్కుకుంటున్నారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 50 కి పైగా కేసులు నమోదు అయ్యాయి. అయితే లేటెస్ట్ గా గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. Kaushik Reddy
CID notices to BRS MLA Padi Kaushik Reddy
ఏప్రిల్ 4వ తేదీన విచారణకు రావాలని సిఐడి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రెండు నెలల కిందట సమ్మక్క సారలమ్మ జాతర వద్ద గొడవకు దిగాడు పాడి కౌశిక్ రెడ్డి. జనవరి 29వ తేదీన సమ్మక్క సారక్క జాతర వద్ద గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కరీంనగర్ కమిషనర్ పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని కేసు నమోదు చేశారు పోలీసులు. Kaushik Reddy
Also Read: KTR: ఎకరాకు రెండు కోట్ల లంచం అడిగిన మంత్రి పొంగులేటి ?
అయితే, ఈ కేసును సీఐడీకి అప్పగించారు. దీంతో ఏప్రిల్ 4వ తేదీన హైదరాబాద్ నగరంలో ఉన్న సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు అధికారులు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు జారీ అయ్యాయి. Kaushik Reddy
Also Read: BJP: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు…నిధులు స్వాహా చేసిన బీజేపీ జిల్లా ఇంచార్జ్‌లు





