కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) అంత్యక్రియల్లో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొని ఆయనకు నివాళి అర్పించారు. ముద్రగడ పాడె మోసిన జగన్ కిర్లంపూడి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా జగన్ చాలా emotional గా కనిపించారు. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన ముద్రగడ భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు.
Mudragada Padem carried by Jagan Reddy
అంత్యక్రియల విషయంలో మొదట్లో కొంత confusion ఉంది. ప్రభుత్వం official లాంఛనాలతో చేయాలనుకుంది. కానీ ముద్రగడ కుటుంబం ఆ ప్రతిపాదనను reject చేసింది. బతికున్నప్పుడు ఆయన్ను అనేక విధాలుగా అవమానించారని, ఇప్పుడు అధికారిక సానుభూతి అవసరం లేదని కుటుంబ సభ్యులు తేల్చేశారు. వైసీపీ నేత జక్కంపూడి రాజా ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముద్రగడ అధికారం కోసం పరిగెత్తిన వ్యక్తి కాదని, ప్రజా సమస్యలపై పోరాడిన నాయకుడు అని కొనియాడారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ భీమవరం పర్యటన తర్వాత నేరుగా కిర్లంపూడి వచ్చారు. అక్కడ ముద్రగడ పాడెకు నివాళి అర్పించిన జగన్, కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. పార్టీ నేతలతో కలిసి ఆయన స్వయంగా పాడె మోశారు. కార్యక్రమం మొత్తం పూర్తయ్యే వరకు జగన్ అక్కడే ఉండి, ముద్రగడ కుటుంబానికి పూర్తి మద్దతుగా నిలుస్తామని clear చేశారు.
ప్రస్తుతం ముద్రగడ నివాస ప్రాంగణంలో ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో అభిమానులు, మద్దతుదారులు తరలివచ్చి తమ నాయకుడికి నివాళులు అర్పిస్తున్నారు. చాలామంది emotional గా కనిపిస్తున్నారు. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో తాజా చర్చకు దారితీసింది. ముద్రగడ పాడె మోసిన జగన్ చర్యను అందరూ హైలైట్ చేస్తున్నారు.





