భారతదేశంలో ఇప్పుడు EV Market పూర్తి జోరు మీదుంది. కొత్త రిపోర్ట్ ప్రకారం, 2032 నాటికి దేశంలో ఏటా సుమారు 3.04 కోట్ల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యే అవకాశం ఉంది. ఫుల్ గా 12 రెట్లు పెరిగే ఛాన్స్ ఉంది. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఛార్జింగ్ స్టేషన్లు వల్ల జనాలు ఈవీస్ వైపు కన్నేస్తున్నారు. ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ నివేదిక ప్రకారం, ఈ రేంజ్లో మార్కెట్ ఊపందుకుంటోంది.
EV Market కేంద్రంగా విస్తరణ
2024లో 20 లక్షల ఈవీలు అమ్ముడుపోవడం, 2025లో 26 లక్షలకు చేరడం ఓ పెద్ద జంప్. కేవలం 26 శాతం గ్రోత్ నమోదైంది. మొత్తం వాహనాల సేల్లో ఈవీలు 2024లో 8.1 శాతం ఉంటే, 2025లో 9.5 శాతానికి పెరిగాయి. ఇక టూ-వీలర్స్, త్రీ-వీలర్స్ రెండు కలిపి ఈ సేల్లో 91 శాతం షేర్ చేస్తున్నాయి. అంటే ఈ రెండు క్యాటగిరీలే ఈవీ బూమ్ కు మెయిన్ పిల్లర్లు.
బ్యాటరీ డిమాండ్లోనూ పెద్ద పెరుగుదల కనిపిస్తోంది. 2025లో 19 GWh డిమాండ్ ఉంటే, 2032 నాటికి అది 362 GWh కు చేరుతుంది. ఈ డిమాండ్లో ఫోర్-వీలర్స్ 40 శాతం షేర్ తో ముందున్నాయి. త్రీ-వీలర్స్ 27 శాతం, టూ-వీలర్స్ 23 శాతం షేర్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈవీ స్పేర్ పార్ట్స్ మార్కెట్లో బ్యాటరీ ప్యాక్స్ 52 శాతం వాటాతో టాప్ లో ఉండగా, మోటార్లు 22 శాతం, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ 11 శాతం షేర్ కలిగి ఉన్నాయి.
లోకల్ మేకింగ్, సప్లై చెయిన్ లోకలైజేషన్ లాంటి ఛాలెంజెస్ కూడా మార్కెట్ ముందు ఉన్నాయి. వీటిని సాల్వ్ చేస్తే ఇండియాలో ఈవీ మార్కెట్ మరింత పుంజుకుంటుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.





