US visa: అమెరికాలో విదేశీ విద్యార్థులకు నాలుగేండ్ల గడువు.. ట్రంప్ నిబంధనలు

అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు కొత్త US visa నిబంధనలు షాక్ ఇవ్వబోతున్నాయి. ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన ఈ మార్పులతో ఇకపై అంతర్జాతీయ విద్యార్థులు గరిష్టంగా నాలుగేళ్లు మాత్రమే ఉండొచ్చు. పాత నిబంధనలో ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ ను తొలగించి, దాని స్థానంలో ఫిక్స్డ్ టైమ్ లిమిట్ ను ప్రవేశపెట్టారు. ఈ నిబంధన F-1 visa హోల్డర్లకు మాత్రమే కాదు, J-1 ఎక్స్ఛేంజ్ విజిటర్లు, ఫారిన్ మీడియా రిప్రెజెంటేటివ్లకూ వర్తిస్తుంది.

US visa నిబంధనల్లో కీలక మార్పు

ప్రస్తుతం అమెరికాలో 3.31 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో చాలామంది PhD, మెడికల్ ట్రైనింగ్, ఇంజనీరింగ్ రీసెర్చ్ వంటి కోర్సులు చేస్తున్నారు, ఇవి నాలుగేళ్ల కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పుడు వీరు తమ కోర్సు పూర్తి చేయడానికి డీఎస్ఎస్ నుండి ఎక్స్టెన్షన్ తీసుకోవాలి. అయితే ఫైలింగ్ డిలే లేదా ప్రాసెసింగ్ ఇష్యూస్ వల్ల స్టేటస్ మిస్ అయితే, వారు చట్టవిరుద్ధంగా మారే ప్రమాదం ఉంది. కొత్త నిబంధనను కాంగ్రెస్ ఆమోదించిన తర్వాతే అమల్లోకి వస్తుంది.

గ్రీన్కార్డ్ విషయంలోనూ ట్రంప్ సర్కార్ షాకింగ్ ప్రపోజల్ తీసుకొచ్చింది. గ్రీన్కార్డ్ కోసం అప్లై చేసే వారు $1,00,000 (సుమారు రూ.96 లక్షలు) బాండ్ డిపాజిట్ చేయాలని వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ చేసింది. ఈ డిపాజిట్ గ్రీన్కార్డ్ అప్రూవ్ అయిన తర్వాత రీఫండ్ చేస్తారు. ప్రస్తుతం భారతీయులకు ఏటా 9,800 గ్రీన్కార్డ్లు మాత్రమే దక్కుతున్నాయి, వెయిటింగ్ లిస్ట్ 10 లక్షలు దాటింది. కొత్త బాండ్ నిబంధన వీరికి మరింత ఇబ్బంది తెచ్చే అవకాశం ఉంది.

ఈ మార్పులు ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ ను స్ట్రాంగ్ చేయడానికి, నేషనల్ సెక్యూరిటీ కోసం తెచ్చినట్టు ప్రభుత్వం చెబుతోంది. కానీ విశ్వవిద్యాలయాలు మాత్రం ఇది వేలాది స్టూడెంట్లకు అనిశ్చితిని సృష్టిస్తుందని హెచ్చరిస్తున్నాయి. కొత్త నిబంధనలు ఖరారు కావడానికి ఇంకా కాంగ్రెస్ ఆమోదం అవసరం, రిపబ్లికన్ పార్టీ నుండి మరిన్ని కఠిన చర్యలు రావొచ్చని ట్రంప్ సపోర్టర్లు అంటున్నారు. దీంతో భారతీయ స్టూడెంట్లు, గ్రీన్కార్డ్ ఆశావహుల్లో ఆందోళన నెలకొంది.

Share your love