హీరోయిన్ సమంత రూత్ ప్రభు లీడ్ రోల్ లో నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ మూవీ కేవలం 28 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేయడం స్పెషల్. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకే ఇలా త్వరగా డిజిటల్ రిలీజ్ దొరుకుతుంది. కానీ మహిళా ప్రధాన కథగా వచ్చిన ఈ సినిమా కూడా అదే రేంజ్‌లో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం గొప్ప విషయం.
Maa Inti Bangaram OTT Review
నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి రాజ్ నిడిమోరు స్క్రీన్‌ప్లే రాశారు. భావోద్వేగాలు, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను బ్యాలెన్స్ చేసిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తెచ్చి మహిళా ప్రధాన తెలుగు సినిమాల్లో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో సమంత ‘స్వర్ణ’ పాత్రలో కనిపించింది. పెళ్లి తర్వాత తొలిసారి భర్త ఇంటికి వెళ్లిన ఓ అమ్మాయి, కొత్త కుటుంబంలో సెటిల్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఆమె పాస్ట్ లైఫ్‌కి సంబంధించిన ఓ సీక్రెట్ ఆమె జీవితాన్ని ట్విస్ట్ చేస్తుంది. ఫ్యామిలీని కాపాడుకోవడానికి స్వర్ణ చేసిన పోరాటమే సినిమా మెయిన్ స్టోరీ.
భావోద్వేగ సీన్స్‌తో పాటు సమంత చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఆడియన్స్‌ను బాగా ఇంప్రెస్ చేశాయి. ఈ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత స్వయంగా రాజ్ నిడిమోరు, హిమాంక్ రెడ్డి దువ్వురుతో కలిసి ప్రొడ్యూస్ చేశారు. నటిగానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా సమంత మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. సినిమాలో గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, శ్రీముఖి, మంజూష ముళ్లపూడి, గౌతమి కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచాయి.
ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ జియో హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో లభిస్తోంది. జూలై 17 అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ మూవీకి ఓటీటీ ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫ్యామిలీతో కలిసి చూసేందుకు పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా నిలిచింది. ఇంకా చూడని వారు ఈ వీకెండ్‌లో ట్రై చేయడం మిస్ చేయకండి.





Motherhood: సమంత మాతృత్వం.. ఎమోషనల్ కామెంట్స్