property dispute: వదినను చంపి ఆస్తి దక్కించుకునే కుట్ర బట్టబయలు

ఆస్తి కోసం వదినను చంపేయాలని plan చేసిన ఓ మరిది కుట్ర పోలీసులకు చిక్కింది. property dispute లో భాగంగా ఉత్తరప్రదేశ్ నుంచి సుపారీ కిల్లర్ ను తెప్పించి హత్యాయత్నానికి పాల్పడిన ప్రధాన నిందితుడితో సహా మొత్తం నలుగురినీ పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి డీఎస్పీ రాములు ఈ కేసు వివరాలను మీడియాకు చెప్పారు. మెట్ పల్లి పోచమ్మవాడకు చెందిన గోనెల శంకర్, రాజం అనే అన్నదమ్ముల మధ్య ఉమ్మడిగా ఉన్న 58 గుంటల భూమి వివాదంతో మొదలైన ఇదంతా.

Property Dispute Escalates to Murder Plot

శంకర్ తన అన్నకు తెలియకుండా భూమిని అమ్మేశాడు. ఇంటిని కూడా తన పేరు మీదికి మార్చేశాడు. దీంతో ఇరు కుటుంబాల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ కక్షతో శంకర్ గతంలో రెండు సార్లు తన అన్న రాజం, వదిన లక్ష్మిపై దాడి చేశాడు, కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పుడు ఎలాగైనా ఆస్తి మొత్తం తన సొంతం చేసుకోవాలనుకున్న శంకర్ తన భార్య అనూష, బంధువు ముత్తన్నతో కలిసి వదినను చంపడానికి పక్కా plan వేశాడు. తన వద్ద డ్రైవర్ గా ఉన్న ప్రయాగ్ రాజ్ కు చెందిన సచిన్ వర్మను డబ్బు ఆశ చూపించి ఈ పనికి ఒప్పించాడు.

సచిన్ ప్రయాగ్ రాజ్ లో ఓ సాధువు దగ్గర నాటు పిస్టల్, మూడు బుల్లెట్లు కొన్నాడు. శంకర్ ఫోన్ పే ద్వారా అతనికి రూ. 35 వేలు పంపించాడు. గత నెల 13న సచిన్ లక్ష్మి ఇంటికి వెళ్లినా భయపడి కాల్పులు జరపకుండా వెనుదిరిగి వెళ్లిపోయాడు. మళ్లీ 15న అర్ధరాత్రి సచిన్ బైక్ మీద వెళ్లి ఆవరణలో నిద్రిస్తున్న లక్ష్మిపై కాల్పులు జరిపాడు. అయితే బుల్లెట్ గురితప్పి ఆమె ఎడమ చెంప భాగంలో తగిలింది. శబ్దం విని లక్ష్మి కేకలు వేయడంతో సచిన్ పరారయ్యాడు.

నిందితులు ఈ దాడిని గుర్తుతెలియని వ్యక్తులు కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సచిన్ ను వెంటనే ఉత్తరప్రదేశ్ కు పంపించి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడ్డారు. కానీ బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. తర్వాతి రోజే శంకర్, ముత్తన్నను అరెస్ట్ చేశారు. 28న అనూషను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రిలో లక్ష్మికి శస్త్రచికిత్స చేసినప్పుడు బుల్లెట్ బయటపడటంతో కేసు కీలక మలుపు తిరిగింది. పోలీసులు ప్రత్యేక బృందంతో ప్రయాగ్ రాజ్ వెళ్లి సచిన్ ను అరెస్ట్ చేశారు. అతడి నుంచి పిస్టల్, బుల్లెట్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. సీఐ సురేశ్ బాబు, ఎస్సై కిరణ్ కుమార్ లను డీఎస్పీ అభినందించారు.

https://x.com/pakkafilmy007/status/1600352362639822848

Share your love