Weekend Comments By RK: ఎన్టీవీ ఛానల్ పై ఏబీఎన్ రాధాకృష్ణ స్పెషల్ రిపోర్ట్?

Weekend Comments By RK
Weekend Comments By RK

Weekend Comments By RK: కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే మహిళ ఐఏఎస్ అధికారి పైన వచ్చిన కథనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పెద్ద దుమారం రేపుతోంది.. ఈ సంఘటనకు సంబంధించి ప్రత్యేక కథనం ఎన్టీవీ చానల్లో ప్రచురణ అయింది. దీంతో ఎన్టీవీ ఛానల్ రిపోర్టర్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్టు చేయించింది. ఇలాంటి నేపథ్యంలోనే రిపోర్టర్లను విడుదల చేయాలని కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. Weekend Comments By RK

Weekend Comments By RK on ntv and bhatti

దీంతో సమస్య సద్దుమణిగింది అనే లోపు.. ఏబీఎన్ రాధాకృష్ణ ప్రత్యేక కథనంతో బాంబు పేల్చాడు. బట్టి విక్రమార్క, ఎన్ టీవీ ఛానల్ పరువు తీసేలా ఈ కథనాన్ని రూపొందించారు. ఎన్ టీవీ ఛానల్ ఓనర్ కు సంబంధించిన అల్లుడికి బొగ్గు గనుల కాంట్రాక్టు కావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ కథనంలో వెల్లడించారు. అయితే అదే కాంట్రాక్టుకు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తమ్ముడు అనిల్ రెడ్డి కంపెనీ కూడా ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించేందుకు ఎన్టీవీ చేత.. అసభ్యకరమైన ప్రత్యేక కథనం వేయించారని ఏబీఎన్ రాధాకృష్ణ చెప్పే ప్రయత్నం చేశారు. Weekend Comments By RK

Also Read: AIADMK: పురుషులకు సైతం ఫ్రీ బస్..మేనిఫెస్టో విడుదల చేసిన ఏఐడీఎంకే పార్టీ

అంతేకాదు ఆ బొగ్గు గనుల కాంట్రాక్టు వస్తే 26 సంవత్సరాల పాటు పంట పండినట్లేనట. దానిపైన ఎన్టీవీ చైర్మన్ అల్లుడు కన్ను వేసినట్లు కథనంలో వెల్లడించాడు ఏబీఎన్ రాధాకృష్ణ. అయితే దీనిపై ఎన్ టీవీ ఛానల్ చాలా సీరియస్ గా వ్యవహరిస్తోందట. ఒక మీడియా ఛానల్ పైన మరో మీడియా ఛానల్ ఇలా వ్యవహరించడం చాలా దారుణమని ఎన్టీవీ జర్నలిస్టులు కూడా ఫైర్ అవుతున్నారు. కెసిఆర్ అలాగే జగన్ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా సోషల్ మీడియాలో ఏబీఎన్ రాధాకృష్ణకు కౌంటర్ ఇస్తున్నారు. Weekend Comments By RK

Also Read: TDP: మరో వివాదంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్

Share your love