
Akkineni Amala: అక్కినేని అమల పెళ్లయ్యాక హీరోయిన్గా తన కెరీర్ ని పక్కన పెట్టేసి పూర్తిగా ఇంటిపట్టునే ఉంటూ ఇంటిని చాలా బాగా చకదిద్దింది.ముఖ్యంగా నాగేశ్వరరావు కి ఇష్టం లేని పెళ్లి చేసుకున్న నాగార్జున అమలను ఇంటికి తీసుకువచ్చాక ఒక మంచి కోడలుగా అత్తమామల దగ్గర పేరు తెచ్చుకోవడమే కాకుండా మంచి ఇల్లాలుగా కూడా పేరు తెచ్చుకుంది. అలా నాగార్జునకి సరైన భార్యగా కూడా అమలని ఎంతోమంది మెచ్చుకుంటారు. అయితే అలాంటి అమల సినిమాల్లో హీరోయిన్ గా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఆ తర్వాత కొద్ది రోజులకు కొన్ని సినిమాల్లో కీ రోల్స్ పోషించింది.
Akkineni Amala is emotional
అలా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఒకే ఒక జీవితం,మనం వంటి సినిమాల్లో కీ రోల్స్ పోషించింది. అయితే అలాంటి అమల సినిమాలు తగ్గించినప్పటికీ బ్లూ క్రాస్ సహవ్యవస్థాపకురాలిగా పనిచేస్తున్న సంగతి మనకు తెలిసిందే.అలా అక్కినేని అమలకు జంతువులు అంటే చాలా ఇష్టం.జంతు ప్రేమికురాలుగా ఉన్న అమల బ్లూ క్రాస్ సహవ్యవస్థాపకురాలిగా ఉంది.అయితే అలాంటి అమలను కొంతమంది అప్పుడప్పుడు తీవ్రంగా విమర్శిస్తూ ఉంటారట. అదేంటంటే ఈ మధ్యకాలంలో వీధి కుక్కల బెడద ఎక్కువైపోయింది.ఎక్కడ చూసినా సరే వీధి కుక్కల దాడుల్లో ఎంతోమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. (Akkineni Amala)
Also Read: Tarun Bhaskar: హీరోయిన్ తో ప్రేమ.. గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అంటూ ఒప్పుకున్న పెళ్లిచూపులు డైరెక్టర్.!
అయితే వీధి కుక్కలను చంపేయాలని కొంతమంది అంటే పెట్ లవర్స్ మాత్రం అవి మాత్రం ప్రాణులు కాదా అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధం చేస్తున్నట్టే చేస్తారు.కానీ కుక్కల కంటే మనుషుల ప్రాణం గొప్ప అనేది మాత్రం తెలుసుకోరు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమల నేను జంతు ప్రేమికురాలిని అని తెలిసి కొంతమంది ఎక్కడైనా కుక్కలు ఎవరినైనా కరిస్తే అందరూ తననే తిట్టుకుంటారు.. కుక్కల్ని చంపొద్దు కుక్కల్ని కొట్టొద్దు అని అంటుంది.. ఇప్పుడు ఆ కుక్కల వల్లే మా పిల్లల ప్రాణాలు పోయాయి అని నన్నే నిందిస్తూ ఉంటారు. అన్నింటికీ నన్నే తప్పు పడతారు అంటూ అమల ఎమోషనల్ అయింది.

కుక్కల్ని తరలిస్తే వద్దని చెబుతుంది. ఇప్పుడేమో కుక్కలు మా పిల్లల్ని కరిచి చంపేస్తున్నాయి అని నన్నే నిందిస్తారు అంటూ అమల మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.అయితే జంతు ప్రేమికురాలు అయినప్పటికీ ఈ మధ్యకాలంలో కుక్కల వల్ల ఎంతోమంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ విషయంలో చాలామంది జంతు ప్రేమికులను సోషల్ మీడియా వేదికగా తిట్టి పోశారు. పిల్లలకంటే కుక్కల ప్రాణాలే గొప్ప అంటూ నిందిస్తూ ఉంటారు. అలా తిట్లు తిన్న వారిలో నేను కూడా ఉంటాను అని తాజాగా ఆ ఇంటర్వ్యూలో అమల చెప్పుకొచ్చింది.(Akkineni Amala)

