తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు అందరి దృష్టి ‘రాకా’పై పడింది. బన్నీ అల్లు అర్జున్ హీరోగా, బ్లాక్బస్టర్ దర్శకుడు అట్లీ కెమెరా ముందుండి తెరకెక్కిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, ఇది కేవలం సాధారణ సినిమా కాదని, ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ సినిమా కథాంశం గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. పురాణ కాలం, వేద కాలం, వర్తమాన కాలం… ఇలా మూడు వేర్వేరు కాలాలను అనుసంధానిస్తూ కథ సాగుతుందని సమాచారం. అంటే కేవలం ఒక కాలంలో నిలిచిపోకుండా, కాలాల మధ్య ప్రయాణించే ఒక భారీ కథాంశంతో అట్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇలాంటి కథాంశం తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని టాక్ నడుస్తోంది.
ఇక ఈ కథలో పునర్జన్మ, ప్రతీకారం అనే అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని వినిపిస్తున్న వార్తలు హాట్ టాపిక్గా మారాయి. పునర్జన్మతో మొదలై ప్రతీకారంతో ముగిసే ఈ కథలో బన్నీ పాత్ర ఎలా ఉంటుందనేది ఇప్పుడు ప్రశ్న. ఇక ఈ చిత్రంలో గిరిజన రాణి పాత్రలో ఒక ప్రముఖ నటి కనిపించబోతుందనే ప్రచారం మరింత సస్పెన్స్ను పెంచుతోంది. ఈ పాత్రకు ఎవరిని ఎంచుకున్నారనేది చిత్ర యూనిట్ మాత్రమే తెలిసిన విషయం. ఇలాంటి కథాంశంతో, భారీ తారాగణంతో ‘రాకా’ ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాల్సి ఉంది.





