Allu Sirish: రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్న అల్లు శిరీష్.. ఫొటోస్ వైరల్.!

Allu Sirish secretly engaged
Allu Sirish secretly engaged

Allu Sirish: ఏంటి అల్లు శిరీష్ రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారా? ఇదెక్కడి ట్విస్ట్ రా మావా.. అనుకుంటారు చాలామంది ఈ విషయం తెలిసిన నెటిజన్లు.ఎందుకంటే రీసెంట్ గానే అల్లు శిరీష్ నానమ్మ చనిపోయింది.కాబట్టి ఇప్పుడప్పుడే పెళ్లి ఎలా జరుగుతుంది అని చాలామంది ఆశ్చర్యపోతారు.ఇది రూమర్ అని ఇంకొంతమంది అనుకుంటారు. కానీ ఇది రూమర్ అయితే కాదు.

Allu Sirish secretly engaged

ఎందుకంటే స్వయంగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో అల్లు శిరీష్ అభిమానులతో షేర్ చేసుకున్న విషయం. తాజాగా అల్లు రామలింగయ్య బర్త్ యానివర్సరీ సందర్భంగా తన ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని కూడా బయటపెట్టారు అల్లు శిరీష్.ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా పోస్ట్ పెట్టారు. మా తాతయ్య జయంతి సందర్భంగా నా మనసుకు దగ్గరైన ఓ విషయం మీకు చెప్పాలని అనుకుంటున్నాను. (Allu Sirish)

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ని అవమానించిన నిహారిక..!

రీసెంట్ గానే నాకు నైనిక తో ఎంగేజ్మెంట్ అయింది. మా ప్రేమకి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడంతో మా ఎంగేజ్మెంట్ జరిగింది. అలాగే రీసెంట్ గా చనిపోయిన మా నాన్నమ్మ నా పెళ్లి చూడాలని ఎంతో ఆతృతగా ఉండేది.కానీ ప్రస్తుతం ఆమె ఇక్కడ లేకపోయినప్పటికీ ఎక్కడ ఉన్నా మా జంటని ఆమె దీవిస్తుంది ఆమె ఆశీర్వాదాలు ఎప్పటికీ మాపై ఉంటాయి అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టడంతో పాటు నైనిక చేతు పట్టుకున్న ఫోటోలను కూడా షేర్ చేశారు.

Allu Sirish secretly engaged

ఆ ఫోటోలో ఈఫిల్ టవర్ స్పష్టంగా కనిపిస్తోంది అంటే నైనిక అల్లు శిరీష్ ల ఎంగేజ్మెంట్ ప్యారిస్ లో కుటుంబ సభ్యుల మధ్య జరిగినట్టు తెలుస్తోంది.అలాగే ఫోటోలో అమ్మాయి కనిపించడం లేదు కానీ ఇద్దరి చేతులు మాత్రం కనిపిస్తున్నాయి. అలాగే ఆ చేతి వేళ్లకు ఎంగేజ్మెంట్ రింగు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. చాలా సంవత్సరాలనుండి హైదరాబాద్ కి చెందిన నైనికతో అల్లు శిరీష్ ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. అలా ఫైనల్ గా వీరిద్దరి పెళ్ళికి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు.(Allu Sirish)

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu