Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ని అవమానించిన నిహారిక..!

Niharika insulted Pawan Kalyan

Pawan Kalyan: మెగా ఫ్యామిలీలో హీరోలకు కొదువేలేదు.. కానీ హీరోయిన్ గా మాత్రం ఎవరు ఎంట్రీ ఇవ్వలేదు. నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్ గా వచ్చినా కానీ ఆమె పెద్దగా గుర్తింపు పొందలేదు. అలాంటి నిహారిక ఇక సినిమాల్లో నటించడం మానేసి ప్రొడ్యూసర్ గా అవతారం ఎత్తింది.పలు చిత్రాలు చేస్తూ ముందుకు వెళ్తోంది. ఇదే తరుణంలో నిహారిక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని నాకు అత్తగా ప్రమోషన్ వచ్చిందని చాలా సంతోషంగా ఉన్నానని చెబుతోంది.

Niharika insulted Pawan Kalyan

మా అన్నయ్యకు కొడుకు పుట్టినప్పటినుంచి నాకు మా ఇంట్లో ఎవరూ పనులు చెప్పడం లేదని అన్నది.. నేను సపరేట్ గా ఉంటున్నానని, ఒకవేళ మా ఇంటికి వెళ్తే నేను ఎప్పుడు వాన్ని ఎత్తుకునే ఉంటానని తెలియజేసింది. వాడు పుట్టకముందు నాకు ఇంట్లో వాళ్ళందరూ పనులు చెప్పేవారని నీళ్లు తీసుకురాపో, ఆ పని చెయ్ అంటూ విసిగించే వారని చెప్పుకొచ్చింది.. గత కొద్ది రోజులుగా నేను సపరేట్ గా ఉండడం మొదలు పెట్టానని, అలా అని మా కుటుంబానికి దూరంగా ఏమీ ఉండడం లేదని కనీసం రెండు రోజులకు ఒకసారి అయినా వెళ్లి ఇంట్లో వాళ్ళందరి కలిసి వస్తానని చెప్పుకొచ్చింది.. (Pawan Kalyan)

Also Read: Thaman: గేమ్ ఛేంజర్ సినిమాపై మరోసారి విషం చిమ్మిన తమన్..రామ్ చరణ్ ని వాడుకోలేదంటూ.?

నేను సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు చాలా ఒత్తిడికి లోనవుతానని కానీ ఆ ఒత్తిడి పోగొట్టుకోవాలంటే మా కుటుంబంతో కలిసి కాసేపు ఉంటే చాలు అంతా మర్చిపోతానని చెప్పుకొచ్చింది. అయితే నా మొదటి సినిమా ‘ఒక మనసు’ నేను ఈ సినిమాలో బాగా నటించలేదు. కానీ ఆ మూవీ కోసం చాలా కష్టపడ్డాను అప్పుడు నాకు 20ఏళ్ళే అని చెప్పుకొచ్చింది. హీరోయిన్ గా ఏదైనా మంచి ఆఫర్ వస్తే చేయాలనుకుంటున్నానని తెలియజేసింది.. ఈ మధ్యకాలంలోనే పుస్తకాలు చదవడం కూడా మొదలుపెట్టానని నిహారిక చెప్పుకొచ్చింది.

Niharika insulted Pawan Kalyan

అంతేకాదు ఈ మధ్యకాలంలోకి వచ్చిన సినిమాల్లో ‘మీరాయ్ ‘ చిత్రం నాకు బాగా నచ్చిందని అన్నది. అంతేకాదు ఏదైనా సినిమాలో హీరోయిన్ గా మంచి ఆఫర్ దొరికితే తప్పకుండా చేస్తానని తెలియజేసింది.. అయితే ఈ మధ్యకాలంలో ఓజి సినిమా కూడా విడుదలైంది.కానీ తన బాబాయ్ ఓజి సినిమా గురించి చెప్పకుండా మిరాయ్ సినిమా నచ్చిందని చెప్పడంతో చాలామంది ఈ విషయాన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ ని అవమానించిన నిహారిక అంటూ వైరల్ చేస్తున్నారు.(Pawan Kalyan)

Share your love