AMBATI RAMBABU :ఆ వైసీపీ నేత‌తో కాపులు ట‌చ్ లోకి

ambati

AMBATI RAMBABU : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఊహించ‌డం చాలా క‌ష్టం అనే చెప్ప‌వ‌చ్చు. ఏపీ ప్ర‌జ‌లు కూడా చాలా తెలివిగ‌ల వారు. 2014లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం విడిపోయిన స‌మ‌యంలో టీడీపీ కి అధికారం క‌ట్ట‌బెట్టారు. 2019లో వైసీపీకి అధికారం ఇచ్చారు. 2024లో మ‌ళ్లీ ఎన్డీఏ కూట‌మిని గెలిపించారు. ఎప్పుడూ ఒక్క‌ర్నే అధికారంలో ఉంచ‌కుండా ప్ర‌తి 5 సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి మార్చుతున్నారు. ప్ర‌స్తుతం మ‌ళ్లీ రాజ‌కీయాలు మారుతున్నాయి.

Ambati Rambabu in touch with kapu Leaders

ఏదైనా ఒక సంఘ‌ట‌న రాజ‌కీయంగా పెను సంచ‌ల‌నం సృష్టిస్తోంది. తాజాగా వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఇటీవ‌ల వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే. అత‌ని ఇంటి పై దాడి ఏపీలో బ‌ల‌మైన ప్ర‌భావం చూపుతోంది. ప్ర‌ధానంగా కాపుల్లో తీవ్ర ఆవేద‌న‌, ఆగ్ర‌హం తీసుకురావ‌డానికి అంబ‌టి ఉదంతం కార‌ణ‌మైంది. కాపుల్లో రాజ‌కీయ ప‌లుకుబ‌డి క‌లిగిన ఓ నేత అంబ‌టి రాంబాబుతో ట‌చ్ లో ఉన్న‌ట్టు స‌మాచారం.

Also Read : GONDU SHANKAR :హరీష్ రావు లాగా శాశ్వత ఎమ్మెల్యే అవుతా.. TDP నేత సంచలనం

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలో ఉండ‌టంతో నేరుగా కొంత మంది అంబ‌టిని క‌లువ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఆయ‌న‌కు ఫోన్లు చేసి దాడిని ఖండిస్తున్న‌ట్టు చెప్పారు. మ‌రోవైపు వంగ‌వీటి మోహ‌న్ రంగా మాదిరిగా పౌరుషం ప్ర‌ద‌ర్శించావ‌ని పొగిడారు. మ‌రోవైపు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ధోర‌ణీ కొంత మంది కాపు నేత‌లు త‌ప్పు ప‌డుతున్న‌ట్టు స‌మాచారం. కాపుల్నీ అణ‌చివేసేందుకు టీడీపీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని వాడుకుంటుందని అంబ‌టి రాంబాబుతో ఆ సామాజిక వ‌ర్గం పెద్ద‌లు అభిప్రాయ‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది.

Also Read : Formula-E Race Case: ఫార్ములా ఈ-రేసు కేసులో రేవంత్ సంచ‌ల‌నం..ఆ అధికారిపై వేటు

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu