GONDU SHANKAR :హరీష్ రావు లాగా శాశ్వత ఎమ్మెల్యే అవుతా.. TDP నేత సంచలనం

GONDU SHANKAR : సాధార‌ణంగా రాజ‌కీయాల్లో ఒక లీడ‌ర్ మ‌రో లీడ‌ర్ ను ఆద‌ర్శంగా తీసుకుంటారు. కొంత అభివృద్ధిలో తీసుకుంటే.. మ‌రికొంద‌రూ మ‌రోలా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. తాజాగా ఏపీ కి చెందిన ఓ ఎమ్మెల్యే తెలంగాణ‌కు చెందిన మాజీ మంత్రిని ఆద‌ర్శంగా తీసుకున్నారు. ప్ర‌స్తుతం అత‌ను చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. అత‌ను ఎవ్వ‌రో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. GONDU SHANKAR

Will he become a permanent MLA like Harish Rao? MLA Gondu Shankar’s comments





తెలంగాణ‌లోని సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్ రావు త‌న‌కు ఆద‌ర్శ‌మ‌ని.. ప్ర‌జా సేవ‌కే జీవితం అంటున్నారు ఎమ్మెల్యే గోండు శంక‌ర్. శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ఉండిపోతానంటూ త‌న మ‌న‌స్సులో ఉన్న‌టువంటి మాట‌ను బ‌య‌టికి చెప్పారు. శాశ్వ‌త ఎమ్మెల్యేగా ఉండ‌టం ఏంటి..? మ‌ధ్య‌లో హ‌రీశ్ రావుతో లింక్ ఏమిటి అని ప‌లు అనుమానాలు వ్య‌క్తం కావ‌డం విశేషం. GONDU SHANKAR

Also Read : Vivek: మ‌రోసారి బయటపడ్డ మంత్రి వివేక్ అరాచకాలు ?

శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి పై వివ‌రించిన ఎమ్మెల్యే గోండు శంక‌ర్.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌న్నింటిని ఒక్కొక్క‌టిగా ప‌రిష్క‌రిస్తున్నానని తెలిపారు. ఇలా చెప్పుకుంటూ పోతూ.. స‌డెన్ గా సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్ రావు టాపిక్ తీసుకొచ్చారు. శ్రీకాకుళం నియోజ‌కవ‌ర్గాన్ని సిద్దిపేట‌లా అభివృద్ధి చేస్తాన‌ని తెలిపారు. సిద్దిపేట ప్ర‌జ‌లు త‌మ ఎమ్మెల్యే హ‌రీశ్ రావు ప‌ట్ల ఎలాంటి అభిప్రాయంతో ఉంటారో శ్రీకాకుళం ప్ర‌జ‌లు కూడా త‌నపై అలాంటి అభిప్రాయంతో ఉండేలా ప‌ని చేస్తాన‌ని తెలిపారు. మంత్రి ప‌ద‌వీ పై త‌న‌కు ఆశ‌లేద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డం సంతృప్తినిస్తుంద‌న్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్ రావులా శాశ్వ‌తంగా ఎమ్మెల్యేగా గెలిచేందుకు ప్ర‌జ‌ల‌కు నిత్యం అందుబాటులో ఉంటాన‌ని తెలిపారు. ఎమ్మెల్యే గోండు శంక‌ర్ చేసిన కామెంట్స్ సంచ‌ల‌నంగా మారాయి.

Also Read : Sharada Peetham: శారద పీఠాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ?

Share your love