IRAN-ISRAEL WAR : ప్ర‌ధాని మోడీ పర్య‌ట‌న పై ఒవైసీ సెన్షేష‌న్ కామెంట్స్

IRAN-ISRAEL WAR

IRAN-ISRAEL WAR : భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పై హైద‌రాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ మ‌ధ్య యుద్ధ మేఘాలు క‌మ్ముకున్న ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇజ్రాయెల్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లడం పై అస‌దుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్య‌క్తం చేసారు. ఈ ప‌ర్య‌ట‌న దేశ ప్ర‌యోజ‌నాల‌ను ప‌ణంగా పెట్ట‌డ‌మేన‌ని.. ద‌శాబ్దాలుగా భార‌త్ అనుస‌రిస్తున్న త‌ట‌స్త విదేశీ విధానానికి విరుద్దం అని ఆయ‌న మండిప‌డ్డారు. IRAN-ISRAEL WAR

Owaisi Sensation comments on PM Modi’s visit

దాదాపు ఎనిమిది ద‌శాబ్దాలుగా ప‌శ్చిమాసియా వ్య‌వ‌హారాల్లో స‌మతుల్య‌మైన త‌ట‌స్త వైఖ‌రినీ అవలంభిస్తోంద‌ని గుర్తు చేశారు ఒవైసీ. గ‌ల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మందికి పైగా భార‌తీయులు నివ‌సిస్తున్నార‌ని.. ఈ ప‌ర్య‌ట‌న‌తో భార‌త్ ప‌ట్ల త‌ప్పుడు సంకేతాలు వెళ్లే ప్ర‌మాదం ఉంద‌ని ఒవైసీ ప్ర‌ధాని పై మండిప‌డ్డారు.

Also Read : AMBATI RAMBABU :ఆ వైసీపీ నేత‌తో కాపులు ట‌చ్ లోకి

మ‌రోవైపు భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న ముగిసిన వెంట‌నే ఇరాన్ పై ఇరాన్ పై దాడులు జ‌ర‌గ‌డం పై ఒవైసీ స్పందిస్తూ.. ప్ర‌ధాని విమానం గాల్లో ఉన్న‌ప్పుడే ఈ దాడులు జ‌రిగి ఉంటే బాధ్య‌త ఎవ్వ‌రూ వహించేవారు..? అని ప్ర‌శ్నించారు. ఈ ప‌ర్య‌ట‌న‌ను ఇజ్రాయెల్ త‌న రాజ‌కీయ వ్యూహాత్మ‌క ప్ర‌యోజ‌నాల కోసం వాడుకుంద‌ని విమ‌ర్శించారు. ఇరాన్ పై దాడుల గురించి ఇజ్రాయెల్ ప్ర‌ధాని నెత‌న్యాహు భార‌త్ కి ముంద‌స్తు స‌మాచారం ఇచ్చారా..? అన్న‌ది మోడీ స్పష్టం చేయాల‌ని డిమాండ్ చేశారు ఒవైసీ. మ‌రోవైపు కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజుజు స్పందిస్తూ.. ఒవైసీ కేవ‌లం వార్త‌ల్లో నిల‌వ‌డానికే దిగ‌జారుడు రాజ‌కీయాలు చేస్తున్నార‌ని కౌంట‌ర్ ఇచ్చారు. 

Also Read : GONDU SHANKAR :హరీష్ రావు లాగా శాశ్వత ఎమ్మెల్యే అవుతా.. TDP నేత సంచలనం

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu