Mohsin Naqvi: టీమిండియా ప్లేయర్లు ఉగ్రవాదులు.. రంగంలోకి ఐసీసీ ?

Mohsin Naqvi: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ పూర్తయి దాదాపు నెలరోజులు కావస్తోంది. నెలరోజులు పూర్తయినా కూడా ఆసియా క‌ప్ ట్రోఫీని ఇండియాకు అందించలేదు ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మొహ్సిన్ రజా నఖ్వీ. ట్రోఫీ ఇవ్వమని అడిగితే… తన ఆఫీసుకు వచ్చి, తీసుకు వెళ్ళమని మొహ్సిన్ రజా నఖ్వీ చెబుతున్నారు. సూర్య కుమార్ యాదవ్ ను తన ఆఫీసుకు పంపించాలని మొహ్సిన్ రజా నఖ్వీ ఇప్పటికే ప్రకటన చేశారు. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి మాత్రం దీనిపై సీరియస్ గా వ్యవహరిస్తోంది. ఎవరిని పంపించే సమస్య లేదు… ఇండియాకు ట్రోఫీని పంపించండి.. ఎవరితో పంపించినా పర్వాలేదు… అని బిసిసిఐ చెబుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ దేశానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. Mohsin Naqvi

India Players Branded Terrorists As Mohsin Naqvi Smirks Stealing Asia Cup Trophy

టీమిండియాలో ఉగ్రవాదులు ఉన్నారని కమ్రాన్ అనే వ్యక్తి బాంబు పేలిచాడు. మొహ్సిన్ రజా నఖ్వీ తన పక్కన ఉండగానే కమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆసియా కప్ ఫైనల్ జరిగిన తర్వాత ట్రోఫీ ఇవ్వడానికి మొహ్సిన్ రజా నఖ్వీ ముందుకు వచ్చారు. కానీ టీమిండియా ప్లేయర్లు మాత్రం మొహ్సిన్ రజా నఖ్వీ దగ్గరికి రాలేదని కమ్రాన్ వెల్లడించారు. చాలా సేపు ఎదురు చూసి, మొహ్సిన్ రజా నఖ్వీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడని వివరించారు. అయితే ట్రోఫీ అక్కడే ఉంచితే టీమిండియా ప్లేయర్లు తీసుకువెళ్లే ప్రమాదం పొంచి ఉందని, తన వెంట ట్రోఫీని మొహ్సిన్ రజా నఖ్వీ తీసుకువచ్చాడని తెలిపారు. Mohsin Naqvi

Also Read: Alcohol: ఆకలితో ఉన్నప్పుడు మద్యం సేవిస్తున్నారా…అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి?

ఆ సమయంలో టీమిండియా ప్లేయర్లను ఉగ్రవాదుల తరహాలో మొహ్సిన్ రజా నఖ్వీ ట్రీట్ చేసినట్లు తెలిపారు కమ్రాన్. ఈ వ్యాఖ్యలు చేయగానే మొహ్సిన్ రజా నఖ్వీ పగలబడి నవ్విపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే దీనిపై బీసీసీఐ చాలా సీరియస్ అవుతోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ రజా నఖ్వీపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది బీసీసీఐ. ఏసీసీ చైర్మన్ గా ఉన్న మొహ్సిన్ రజా నఖ్వీపై వేటు వేయాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై ఏం జ‌రుగుతుందో చూడాలి. అటు ఆసియా క‌ప్ ట్రోఫీని ఏసీసీ ఆఫీసు నుంచి అబుదాబీలోని ర‌హ‌స్య ప్రాంతంలో మొహ్సిన్ రజా నఖ్వీ ఉంచాడ‌ట‌. Mohsin Naqvi

Also Read: Ravi tree: రావి చెట్టును పొరపాటున కూడా మీ ఇంట్లో పెంచుకోవద్దు.. లేదంటే దరిద్రం…

Share your love