Kaantha: ఆ హీరో రియల్ స్టోరీనే “కాంత” లో చూపించబోతున్నారా.?

Are you going to show the real story of that hero in Kaantha
Are you going to show the real story of that hero in Kaantha

Kaantha: ఏంటి కాంత మూవీ ఆ హీరో నిజ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నారా.. ఇంతకీ కాంత మూవీని ఏ హీరోని ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. దుల్కర్ సల్మాన్ హీరోగా. రానా కీలక పాత్రలో.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న తాజా మూవీ కాంత. ఈ మూవీ నవంబర్ 14న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తమిళ ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమా గురించి ఒక టాక్ వినిపిస్తోంది.

Are you going to show the real story of that hero in Kaantha

అదేంటంటే..కాంత మూవీ తమిళంలో ఒక్కసారిగా భారీ క్రేజ్ తెచ్చుకొని ఆ తర్వాత కనుమరుగైపోయిన ఓ హీరో రియల్ స్టోరీ అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక ఆ హీరో ఎవరయ్యా అంటే దివంగత నటుడు ఎంకే త్యాగరాజన్.. ఈయన్ని తమిళ ప్రేక్షకులు ఎంటీకే అని ప్రేమగా పిలుచుకుంటారు. అయితే మన తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ ఏఎన్నార్ల కంటే ముందు చిత్తూరు నాగయ్య ఎలా అయితే పేరు తెచ్చుకొని ఆ తర్వాత కనుమరుగైపోయారో తమిళ ఇండస్ట్రీలో కూడా ఎంకేటి ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారట. (Kaantha)

Also Read: Actor: భార్య సె చేయనివ్వట్లేదు.. 18 ఏళ్లుగా మరో మహిళతో సె.. నటుడు షాకింగ్ కామెంట్స్.!

ఆయన చేసిన సినిమాలు ఆ రేంజ్ లో ఉండేవట. అంతేకాదు స్టేజ్ సింగర్ గా తన కెరీయర్ ని మొదలుపెట్టిన ఎంకేటి ఆ తర్వాత నటించిన హరిదాసు అనే మూవీ ద్వారా స్టార్ట్డం సంపాదించారట. అంతేకాదు గతంలో ఈయన బంగారు పళ్లెంలో భోజనం చేయడం మెర్సిడెజ్ బెంజ్ కార్లో తిరగడం అనేది చాలా గొప్ప. కానీ అంత స్టార్డం అనుభవించిన ఎంకేటి అనుకోకుండా ఓ హత్య కేసులో చిక్కుకొని జీవితాన్ని నాశనం చేసుకున్నారు.

Are you going to show the real story of that hero in Kaantha

ఈ హత్య కేసులో ఇరుక్కుని బయటపడ్డాక కూడా సినిమాల్లో అవకాశాలు రాక అనారోగ్యం బారిన పడి డబ్బులన్ని పోగొట్టుకొని తినడానికి తిండి కూడా లేక దీనస్థితిలో కేవలం 49 ఏళ్ల వయసులోనే మరణించారట. అలా ఆ హీరో రియల్ స్టోరీని కాంత మూవీలో చూపిస్తున్నట్టు తమిళ వర్గాల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా విడుదలయితే గానీ అసలు విషయం ఏంటో చెప్పలేం.(Kaantha)

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu