Abhishek Sharma: అఫ్రిది పరువు తీసిన అభిషేక్ శర్మ..రూ.33 ల‌క్ష‌ల కారుతోనే

Abhishek Sharma: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ టీమిండియా గెలుచుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ బౌలర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ. ఎవడైతే నాకేంటి…? అందరి బౌలింగ్ లో… సిక్సులు కొట్టేందుకే తాను ప్రయత్నిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశాడు అభిషేక్ శర్మ. పాకిస్తాన్ ప్రీమియం ఫాస్ట్ బౌలర్ అని చెప్పుకునే షాహిన్ ఆఫ్రిదిని కూడా ట్రోల్ చేసి… పరువు తీశాడు డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ. Abhishek Sharma

Asia Cup Abhishek Sharma Gets Haval H9 SUV Worth ₹33 Lakh

మ్యాచ్ అయిన తర్వాత మీడియాతో… అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ఫాస్ట్ బౌలర్సే కాదు… ప్రీమియం పాస్ బౌల్లర్స్ అయినా సరే తొలి బంతి నుంచే అటాక్ చేయాలని డిసైడ్ అయినట్లు ఈ సందర్భంగా వెల్లడించాడు. మొదటి బంతికే సిక్స్ కొట్టాలన్న కసితో అఫ్రిది బౌలింగ్ లో మొన్న సిక్స్ కొట్టినట్లు వెల్లడించాడు. Abhishek Sharma

Also Read: Janasena MLA: జర్నలిస్టులకు వార్నింగ్…వ్యతిరేక వార్తలు రాస్తే తాట తీస్తా !

ఫైనల్ మ్యాచ్ లో పెద్దగా రాణించలేదని…. భవిష్యత్తులో మళ్లీ పాకిస్తాన్ కు చుక్కలు చూపించడం ఖాయమని హెచ్చరించాడు. దీంతో అభిషేక్ శర్మ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండ‌గా.. ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ ఫైన‌ల్స్ లో టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ సాధించింది. దీంతో 9 వ సారి ట్రోఫీని గెలుచుకుంది టీమిండియా. ఇక ఈ టోర్న‌మెంట్ లో 314 ప‌రుగులు చేసిన అభిషేక్ శ‌ర్మ‌కు హ‌వ‌ల్ హెచ్ 9 కారును మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కింద అందుకున్నాడు. దీని ఖ‌రీదు రూ.33 ల‌క్ష‌లు. Abhishek Sharma

Also Read: Telangana local body poll: స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల… తేదీలు ఇవే