Bajaj Pulsar 400 will launch in the market

Bajaj Pulsar 400: ఇండియన్ మార్కెట్లోకి అనేక వాహనాలు వస్తున్న సంగతి తెలిసిందే. జనాలు విపరీతంగా వాహనాలు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో కంపెనీలు కూడా రకరకాల బైక్స్ అలాగే కార్లను రిలీజ్ చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా విపరీతంగా పెరిగింది. ఎలక్ట్రిక రంగంలో కూడా రకరకాల బైక్స్ వస్తున్నాయి. Bajaj Pulsar 400

Bajaj Pulsar 400 will launch in the market

ఇక ఇలాంటి నేపథ్యంలోనే ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త బైక్ వచ్చేస్తోంది. యూత్ కు దగ్గర అయ్యేందుకు బజాజ్ సరికొత్త ప్లాన్ వేసింది. తమ కంపెనీ నుంచి సరికొత్త బజాజ్ పల్సర్ బైక్ ను తీసుకువస్తోంది. బజాజ్ పల్సర్ 400 పేరుతో కొత్త బైక్ ను రిలీజ్ చేస్తోంది. ఇదివరకే దీనిపై అధికారిక ప్రకటన చేసిన కంపెనీ… తాజాగా బైక్ వీడియో క్లిప్ కూడా లాంచ్ చేసేసింది. Bajaj Pulsar 400

Also Read: Mahindra XUV 3XO: మహీంద్రా నుంచి XUV 3XO.. ధర ₹7.49 లక్షలు..ఫీచర్స్‌ ఇవే

మరి కొత్తగా రిలీజ్ అయిన బజాజ్ పల్సర్ 400 బైక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటివరకు రిలీజ్ అయిన బజాజ్ పల్సర్ల కంటే ఈ బైక్ చాలా విభిన్నంగా ఉంటుంది. పార్ట్స్ అన్ని అప్డేటెడ్ గా ఉంటాయి. ఈ పల్సర్ బైక్ లో డొమినార్ 400 లో ఉపయోగించిన 373 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ వస్తుందని చెబుతున్నారు. Bajaj Pulsar 400

అంతేకాకుండా పవర్ యూనిట్ 39.4 బిహెచ్పి శక్తిని రిలీజ్ చేస్తుందట. 35 ఎం గరిష్ట టార్కును కూడా ఈ బైక్ ఉపయోగిస్తుంది. ఈ బజాజ్ పల్సర్ 400 బైక్ ధర 2 లక్షల వరకు ఉంటుంది. ఎగ్జాక్ట్గా 2.10 లక్షలు గా ఈ బైక్ ధరను నిర్ణయించారు. పల్సర్ 400 బైక్‌…. KTM 390 డ్యూక్, ట్రయంఫ్ స్పీడ్ 400, హీరో మావ్రిక్ 440, TVS Apache RR310 మరియు BMW G310R వంటి వాటికి పోటీగా ఉంటుంది. Bajaj Pulsar 400

Join WhatsApp