First Bajaj CNG : బజాజ్ ఆటో ప్రపంచం లో మొట్టమొదటి సిఎన్జి మోటార్ సైకిల్ ని జూన్ 18 , 2024న విడుదల చేయనుంది. బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ కొత్త పల్సర్ ఎన్ఎస్ 400z విడుదల సందర్భంగా ఈ విషయాన్ని చెప్పారు. ఈ సీఎన్జీ మోటార్ సైకిల్ ప్రపంచంలోనే మొట్టమొదటిది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 4 జెడ్ విడుదల సందర్భంగా ఈ విషయాన్ని చెప్పారు. సిఎంసి మోటార్ సైకిల్ ప్రపంచంలోనే మొట్టమొదటిది ప్రజలకు మరింత చవకైన ప్రయాణ ఎంపీకను అందిస్తుందని హామీ ఇస్తోంది అని చెప్పారు.

First Bajaj CNG details

బజాజ్ నుండి వస్తున్న తులసిఎన్జీ మోటార్ సైకిల్ కి సంబంధించి ఏ వివరాలను ఇప్పటిదాకా చెప్పలేదు. కానీ ఈ బైక్ కి సంబంధించి అనేక లీక్ లు ఇంటర్నెట్లో దర్శనమయ్యాయి. ఈ బైక్ లో డ్యూయల్ ఫ్యూయల్ సిస్టంను సూచించే భారీ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుందని హండ్రెడ్ నుండి 125 సిసి ఇంజన్ రావచ్చని ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు అలానే వెనుక భాగంలో వచ్చేసి మెనో షాక్ డిస్క్ డ్రం బ్రేక్ సెట్ అప్ ఉంటాయని లీక్స్ వచ్చాయి. అయితే భద్రతా ప్రమాణానికి అనుగుణంగా సింగిల్ ఛానల్ ఏబీఎస్ లేదా కామ్బి బ్రేకింగ్ కలిగి ఉండొచ్చు.

Also read: Nothing Phone: భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌..!

ఈ కొత్త తొలి సిఎన్జి బైక్ను ఏమని పిలుస్తారు అని దాని గురించి బజాజ్ ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు. బజాజ్ ఇటీవల బ్రీజర్ పేరుని ట్రేడ్ మార్క్ చేసింది. ఈ సీఎన్జీ మోటార్ సైకిల్ యొక్క అధికారిక పేరు కావచ్చు. ఈ మొట్టమొదట బజాజ్ సిఎన్జి బైక్ భవిష్యత్తులో ఇంకొన్ని సీఎన్జీ మోడల్ లకి దారి తీస్తుంది. బజాజ్ ఆటో ఇటీవల తన పల్సర్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. పల్సర్ ఎన్ఎస్ 400 జెడ్ గా పిలిచే దీని ఎక్స్ షోరూం ధర 1.85 లక్షలు రూపాయలు. 5000 టోకెన్ మొత్తం చెల్లించి బైక్ని బుక్ చేయొచ్చు. జూన్ నుండి డెలివరీలు మొదలు కాబోతున్నాయని కంపెనీ చెప్పింది (First Bajaj CNG).

Join WhatsApp