ప్రపంచంలోనే అత్యంత health-conscious వ్యక్తిగా పేరుగాంచిన బ్రయాన్ జాన్సన్ తనకు ఆటో ఇమ్యూన్ గ్యాస్ట్రిటిస్ (AIG) అనే అరుదైన వ్యాధి ఉందని వెల్లడించాడు. ఈ వ్యాధిలో రోగనిరోధక వ్యవస్థ పొరపాటున కడుపు లైనింగ్ మీదే దాడి చేస్తుంది, దీన్నే తన కడుపు తనే తింటోంది అని అతను X లో పోస్ట్ చేశాడు. 2-5% మందిలో కనిపించే ఈ condition తరచుగా silent గా ఉంటుందని, లక్షణాలు లేకుండానే సంవత్సరాల తరబడి దాగి ఉంటుందని అతను చెప్పాడు.
బ్రయాన్ జాన్సన్ తన చిన్నప్పటి నుంచి ఫాస్ట్ ఫుడ్, చక్కెర సోడా తీసుకున్నట్లు గుర్తు చేసుకున్నాడు. తర్వాత బిజినెస్ ఒత్తిడి వల్ల 40 పౌండ్లు పెరిగి, దీర్ఘకాలిక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను అని చెప్పాడు. 21 ఏళ్ళ వయస్సులో హైపోథైరాయిడిజం డయాగ్నోసిస్ అయింది. కానీ అది కేవలం ఐస్ బర్గ్ టిప్ మాత్రమే. తన శరీరం ఇనుము స్థాయిలు నిరంతరం తగ్గుతూ ఉండటంతో, ఎటువంటి సప్లిమెంట్ పని చేయకపోవడంతో ఈ ఏడాది మేలో AIG డయాగ్నోసిస్ అయింది.
డాక్టర్ల ప్రకారం, AIG అనేది రోగనిరోధక వ్యవస్థ కడుపులోని యాసిడ్ ఉత్పత్తి చేసే కణాల మీద దాడి చేసే పరిస్థితి. దీనివల్ల పోషకాహార లోపం, రక్తహీనత, విటమిన్ B12 లోపం, మరియు క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుంది. థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్నవారిలో ఇది సర్వసాధారణం, దీన్ని థైరోగాస్ట్రిక్ సిండ్రోమ్ అంటారు. ప్రస్తుతానికి దీనికి cure లేదు, కానీ డయాగ్నోసిస్ త్వరగా అయితే సప్లిమెంట్లతో manage చేయవచ్చు.
బ్రయాన్ జాన్సన్ ఇది ఒక challenge గా తీసుకొని, తన ప్రయత్నాలు అన్నీ షేర్ చేస్తాను అని హామీ ఇచ్చాడు. ఈ వార్త AIG గురించి అవగాహన పెంచుతుంది, ఎందుకంటే చాలా మందికి ఈ వ్యాధి తెలియకుండానే ఉండిపోతుంది. అలసట, తక్కువ ఇనుము, వివరించలేని బలహీనత వంటి సింప్టమ్స్ ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.




