విశాల్ మూడు వేర్వేరు పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మకుటం సినిమా ప్రమోషన్స్ హైలో జరుగుతున్నాయి. ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్న విశాల్ కు అంజలి, దుషార విజయన్ జోడీలుగా నటిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం విడుదల కాబోతుంది.
Makutam Action Thriller Update
సూపర్‌గుడ్ ఫిల్మ్స్ 99వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు విశాల్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మంగళవారం విడుదల చేసిన ‘కలతేలా..’ సాంగ్ కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇది ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ముడిపడిన లవ్లీ సాంగ్.
జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చిన ఈ పాటకు రాజశ్రీ సుధాకర్ లిరిక్స్ రాయగా, కృష్ణతేజస్వి గొంతు వినిపించారు. ఆక్షన్ థ్రిల్లర్ అనుకుంటున్నా, ఈ సాంగ్ పూర్తిగా ఎమోషనల్‌గా తీర్చిదిద్దారు. విశాల్ కెరీర్లో ఇది చాలా డిఫరెంట్ స్టోరీ అని మేకర్స్ చెప్పారు.
ఈ సినిమాలో విశాల్ చేయబోయే మూడు పాత్రలు ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తాయి. రవి అరసు కథ అందించగా, ఆర్.బి.చౌదరి నిర్మిస్తున్నారు. త్వరలో రిలీజ్ డేట్ డిక్లేర్ చేస్తారని ఊహిస్తున్నారు. ఆసక్తికరంగా ఉన్న ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు రాబోతున్నాయి.
https://x.com/pakkafilmy007/status/1600352362639822848





