Air India: టాటా గ్రూప్ కి చెందిన దిగ్గజ విమానాయన సంస్థని మారుస్తున్నట్లు ప్రకటించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే, ప్రయాణికులకు ఉచిత బ్యాగేజీ పై ఉన్న గరిష్ట పరిమితిని తగ్గిస్తున్నట్లు చెప్పింది. తక్కువ ధర టికెట్ పై ప్రయాణానికి గతంలో 20 కేజీల దాకా ఉచిత బ్యాగేజీ ఉండేది. అయితే దాన్ని 15 కిలోలకి కుదిస్తున్నట్లు చెప్పింది. ఎవరైతే ఎకానమీలో కంఫర్ట్ కంఫర్ట్ ప్లస్ ఫేర్ క్యాటగిరీ లో టికెట్లు తీసుకుంటారో వాళ్లకి గరిష్టంగా 15 కిలోల వరకు మాత్రమే చెక్ ఇన్ బ్యాగేజ్ తీసుకు వెళ్ళవచ్చు. ఈ కొత్త నిబంధనలు మే 2 నుండి అమలులోకి వచ్చాయి అని ఎయిర్ ఇండియా చెప్పింది.

Air India new rules

ఎయిర్ ఇండియాలో 25 కిలోల దాకా ఉచిత బ్యాగేజ్ కి అనుమతి ఉండేది. టాటా గ్రూప్ కొనుగోలు చేసిన తర్వాత ఉచిత ప్యాకేజీ పరిమితం 20 కి తగ్గించారు. అయితే తాజాగా ఈ ఫ్రీ బ్యాగేజీ పరిమితని 15 కిలోలకి కుదించినట్లు కంపెనీ చెప్పింది. కనీసం 15 కిలోల దాకా బ్యాగేజీని ఉచితంగా అనుమతించాలని డీజీసీఐ ఆదేశాలు ఉన్న క్రమంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also read: Revanth Reddy: చూసి ఓటు వెయ్యకపోతే రిజర్వేషన్లు రద్దు..!

దాదాపు అన్ని ఎయిర్లైన్స్ ఇప్పటికే ఈ లిమిట్ ని అనుసరిస్తున్నాయి. ఇతర సంస్థలు ఒక లగేజీని మాత్రమే అనుమతిస్తుండగా ఎయిర్ ఇండియా మాత్రం పరిమితిలోపు బరువు ఉంటే ఎన్ని బ్యాగులైన తీసుకెళ్లడానికి వెసులుబాటు ఇచ్చింది. ఎయిర్ ఇండియా వివిధ రకాల ఫెయిర్ తరగతుల్ని గత ఏడాది అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రీమియం ఎకానమీ బిజినెస్ ఫస్ట్ క్లాస్ లతో పాటుగా కంఫర్ట్ కంఫర్ట్ ప్లేస్ ఇలా మూడు ఉప తరగతులను తీసుకువచ్చింది వీటితో టికెట్ ధరలతో పాటు ప్రయోజనాలు వేరువేరుగా ఉన్నాయి (Air India).

Join WhatsApp