Again Special FD scheme is available

Mahila Samman Scheme : కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను తీసుకువచ్చింది. కేంద్రం అందిస్తున్న స్కీములు వలన చాలా మందికి ఉపయోగకరంగా ఉంటోంది. మహిళల కోసం కూడా కేంద్రం పలు స్కీములను తీసుకువచ్చింది మహిళలు ఈ స్కీమ్ వలన ఎంతగానో బెనిఫిట్ ని పొందవచ్చు. ఆడపిల్లల కోసం తీసుకువచ్చిన సుకన్య సమృద్ధి యోజన స్కీం ఎంత ఆదరణ పొందిందో మనకి తెలుసు. మహిళా సమాన్ పథకం కి కూడా మంచి ఆదరణ వస్తుంది. మహిళా సమ్మాన్ స్కీమ్ కి 2025 మార్చి వరకు అందుబాటులో ఉంటుంది.

Mahila Samman Scheme details

ఈలోగా ఈ పథకంలో చేరాలి. 2023లో తీసుకువచ్చారు ఈ పథకాన్ని రెండేళ్ల వరకు గడువు ప్రకటించారు. ఎవరైనా మహిళా నేరుగా ఈ స్కీం కింద అకౌంట్ తెరవచ్చు మైనర్ బాలికకి గార్డియన్ గా కూడా ఖాతా ని తెరిచే అవకాశం ఉంటుంది. ఇక ఈ పథకం కింద ఎంత వడ్డీ వస్తుందనే విషయానికి వస్తే.. ఈ పథకం కింద 7.5% వడ్డీ ఇస్తున్నారు. 2025 మార్చిలోగా ఎకౌంటు ఎప్పుడు తెరిచిన రెండేళ్ల దాకా టెన్యూర్ ఉంటుంది.

Also read: Modi: ఇండియా కూటమి వన్ ఇయర్.. వన్ పీఎం కుట్ర..!

రెండు లక్షలు అకౌంట్ లో డిపాజిట్ చేస్తే 7.50 శాతం వడ్డీ కింద రెండు ఏళ్ళ తర్వాత చేతికి 2.32 లక్షల వస్తాయి మధ్యలో అకౌంట్ ని క్లోజ్ చేయడానికి వీలు ఉండదు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఛాన్స్ ఉంటుంది ఏడాది తర్వాత అకౌంట్ నుండి 40% డబ్బులు తీసుకోవచ్చు. వయసుతో సంబంధం లేకుండా భారతీయ మహిళ ఎవరైనా సరే ఈ స్కీమ్ లో చేరొచ్చు. ఒక అకౌంట్లో ఒక డిపాజిట్ మాత్రమే చేయాలి ఒక వ్యక్తికి ఎన్ని అకౌంట్లో అయినా తెరవచ్చు మూడు నెలల గ్యాప్లో ఇంకో ఎకౌంటు తెచ్చుకోవచ్చు (Mahila Samman Scheme).

Again Special FD scheme is available
Join WhatsApp