
Neem: పాతకాలంలో వేప చెట్టు చాలామంది ఇళ్లలో ఉండేది. ఇప్పటికీ పల్లెటూర్లలో చాలామంది ఇళ్ల వద్ద వేప చెట్లను పెంచుకుంటూ ఉంటారు. వేప చెట్లను ఇంటి వద్ద పెంచుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. వాస్తు ప్రకారం వేప చెట్లను ఇంట్లో పెంచుకున్నట్లయితే చాలా మంచిది. వేప చెట్టు ఇంట్లో ఉంటే ఎన్నో రకాల వ్యాధులను మనం తరిమి కొట్టవచ్చు. వేప చెట్టు ఇంటి వద్ద ఉన్నట్లయితే స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి చేరుతుంది. దానివల్ల ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. వేప చెట్టు యాంటీబయాటిక్ ల ఎంతగానో సహాయం చేస్తుంది. వేప చెట్లు ఎంతో చల్లదనాన్ని ఇస్తాయి. Neem
Can a Neem tree grow at home
వేప చెట్టు చల్లదనాన్ని అందించడమే కాకుండా వాస్తు ప్రకారం కూడా ఎన్నో ఫలితాలను చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మన పూర్వీకుల ప్రకారం ఇంటి చుట్టూ వేప చెట్టు నాటుకోవడం వల్ల ఇంట్లో శాంతి, శ్రేయస్సు, శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతూ ఉండేవారు. వేప చెట్టును ఎంతో పవిత్రంగా భావిస్తారు. వేప చెట్టు అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్న పవిత్రమైన చెట్టు ఇది అనేక వ్యాధులను సహజంగానే న్యాయం చేస్తుందని నమ్ముతూ ఉంటారు. వాసు దోషాలను కూడా తొలగిస్తుందని విశ్వసిస్తారు. హిందూమతంలో వేప చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ చెట్టును దేవుడిలాగా పూజిస్తారు. Neem
Also Read: Tollywood: నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఇష్యూ..రంగంలోకి రేవంత్ సర్కార్?
కొంతమంది వేప చెట్టుకు బొట్లు పెట్టి ధూపం వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. వేప చెట్టును ఇంటి బయట నాటడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. వేప చెట్టును శాస్త్రాల ప్రకారం శని, రాహు, కేతువుల చెడు ప్రభావాలను నివారిస్తాయి. అందువల్ల వేప చెట్టు ఇంట్లో ఉండడం వల్ల జీవితంలో శాంతి, శ్రేయస్సు పెరుగుతాయి. ఇక వేప చెట్టును అనేక రకాల ఆయుర్వేద మందులలో వాడుతూ ఉంటారు. అంతేకాకుండా సబ్బులు, షాంపులలో వేప ఆకులను వాడడం మనం చూస్తూనే ఉంటాం. వేప ఆకులు చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ఎంతగానో సహాయం చేస్తాయి. ఏ రకంగా చూసుకున్న వేపచెట్టు ప్రతికూల ఫలితాలను మాత్రమే తీసుకువస్తుంది. అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరు ఇంట్లో వేప చెట్లను పెంచుకోవాలని పండితులు చెబుతున్నారు. Neem
Also Read: Green Tea: ప్రతిరోజు గ్రీన్ టీ తాగుతున్నారా…అయితే డేంజర్ లో పడ్డట్టే ?


