Chandrababu Nayudu: చంద్రబాబు కొత్త ఆలోచన.. పనికిరాని రూల్స్ తొలగించి టెక్ ఆధారిత పాలన!!

సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పనికిరాని business rules మీద ఫోకస్ పెట్టారు. ఇప్పటికే చాలా రూల్స్ బూజు పట్టి ప్రజలకు ఉపయోగపడటం లేదు. ఈ నేపథ్యంలో వాటిని సంస్కరించి కొత్తగా రీడ్రాఫ్ట్ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. పాలనలో టెక్నాలజీని ఎక్కువగా వాడుతూ అనవసరమైన నిబంధనలను తొలగించాలని సీఎం స్పష్టం చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Obsolete Business Rules Reform

సచివాలయంలో జరిగిన రివ్యూలో సీఎం వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. దేవదాయ, ఆర్డీఎఫ్, ఏపీఎస్ఆర్టీసీ, రవాణా, అగ్నిమాపక, వ్యవసాయ శాఖల్లో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలపై దృష్టి పెట్టారు. ప్రోయాక్టివ్ గవర్నెన్స్ ద్వారా అధికారులు చిట్టచివరి వ్యక్తికి కూడా పాలనా ఫలితాలు అందేలా చూడాలని సూచించారు. ఫిర్యాదులను లైట్ తీసుకోవద్దని, ప్రతి అర్జీదారుకు తగిన సమాధానం ఇవ్వాలని సీఎం క్లారిటీ ఇచ్చారు.

రాష్ట్రంలోని 21 ప్రముఖ దేవాలయాలను గ్రోత్ సెంటర్లుగా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. ప్రసాదాల నాణ్యతతో పాటు ఆధ్యాత్మికతను మరింత పెంచే విధంగా ప్లాన్ చేయాలన్నారు. ఈ దేవాలయాలను ఆనుకుని ఆర్థిక కార్యకలాపాలు, టూరిజం పెరిగేలా చర్యలు తీసుకోవాలి. అలాగే క్రౌడ్ సోర్సింగ్ ద్వారా అన్ని ఫిర్యాదుల సమాచారం సేకరించాలని ప్రకటించారు. యూరియా సరఫరా విషయంలో రైతు సంఘాలతో ప్రచారం చేస్తూ దుర్వినియోగం కాకుండా చూడాలని ఆదేశించారు.

గత వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ కక్షతో కొందరి భూములను 22ఏ కింద పెట్టి వివాదాలు సృష్టించిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. ఇప్పటికే 27 లక్షల మందికి పట్టాదారు పాసుపుస్తకాలు అందించామని, మరో 72 లక్షల మందికి జారీ చేయాలన్నారు. శెట్టిపల్లి వివాదాన్ని పరిష్కరించడం ద్వారా 900 కోట్ల విలువైన భూమి ప్రభుత్వానికి వచ్చింది. అగ్నిమాపక శాఖ సేవా ప్రమాణాలు పెంచాలని, బస్టాండ్లలో ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపర్చాలని సూచించారు. అధికారులు తప్పు చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.

Share your love