టీడీపీ నేతల దూకుడు మళ్లీ పార్టీకి తలనొప్పిగా మారింది. చంద్రబాబు, లోకేష్ ఎప్పుడూ కార్యకర్తల బలం మీదే పార్టీ విజయం ఆధారపడి ఉంటుందని చెప్తూనే ఉన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో కొంతమంది లీడర్ల తీరు మాత్రం రివర్స్ లో ఉంది. వారి ఓవర్ యాక్షన్ వల్ల పార్టీ ఇమేజ్ కి డ్యామేజ్ జరుగుతున్నా, అగ్రనేతలు దాన్ని ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. చూస్తే, వారు ఈ విషయాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నట్టే కనిపిస్తోంది.
TDP Leaders Action Endangers Image
గత నాలుగు రోజుల్లోనే రెండు బిగ్ ఇన్సిడెంట్లు జరిగాయి. గుంటూరులో ఒక మహిళ విషయంలో జరిగిన ఘటనతో పార్టీ చిక్కుల్లో పడింది. సీఎం చంద్రబాబు స్పాట్ యాక్షన్ తీసుకుంటూ ఆ నేత మూర్తిని సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు. ఇది సరిపోయిందా అంటే, సరిగ్గా అదే టైంలో కడప జిల్లా బద్వేల్ లో ఇంకో ఘటన జరిగింది. ఇక్కడ వృద్ధురాలి జాకెట్ చిరిగిపోయే స్థాయిలో గొడవ జరిగింది. బాధితురాలు టీడీపీ స్టూడెంట్ విభాగం జిల్లా ప్రెసిడెంట్ మీద నేరుగా కంప్లైంట్ ఇచ్చింది. రెండు కేసుల్లోనూ మహిళలపైనే దాడి జరగడం పార్టీకి మైనస్ పాయింట్ అయింది.
ఈ లెవెల్ లో జరిగే గొడవలు పార్టీ ఓట్ బ్యాంక్ పై డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తాయి. 2019 ఎన్నికల్లో కూడా ఇలాంటి ఈగో బ్యాటిల్సే పార్టీని డైల్యూట్ చేశాయి. అధినేత ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా, లోకల్ లెవెల్ లో నాయకులు వీక్ గా తయారయితే మొత్తం పార్టీకి నష్టం తప్పదు. ఇది టీడీపీకి తెలియని విషయం కాదు. కానీ సస్పెన్షన్ లాంటి చిన్న చర్యలతో వెళ్లిపోతే సరిపోతుందా అనే డౌట్స్ పార్టీ లోపలే వినిపిస్తున్నాయి. బాధితుల సైడ్ నిలబడాల్సిన అవసరం ఉందని సీనియర్లు కూడా ఫీల్ అవుతున్నారు.
రియాలిటీ ఏంటంటే, టాప్ లీడర్షిప్ ఈ ఇష్యూస్ ని పూర్తిగా లైట్ తీసుకుంటోంది. సీరియస్ యాక్షన్ తీసుకోవడంలో డిలే జరగడం డేంజర్ బెల్స్ లాంటిది. ఈ సైలెంట్ అప్రూచ్ ఫ్యూచర్ లో పార్టీకి పెద్ద సంక్షోభం తీసుకురావచ్చు. కార్యకర్తలకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్లాలంటే, చంద్రబాబు మరింత కఠినంగా వ్యవహరించక తప్పదు. లేకపోతే పార్టీ బ్యాడ్ నేమ్ మళ్లీ రిపీట్ అవడం ఖాయం.





