Chiranjeevi: చిరంజీవికి మనవడి కోరిక తీరదు.. మళ్లీ మొదలెట్టిన వేణు స్వామి జాతకాలు.!

Chiranjeevi grandson wish will not be fulfilled

Chiranjeevi: రీసెంట్ గా ఉపాసన శ్రీమంతపు వేడుకలను మెగా ఫ్యామిలీ అంగరంగ వైభవంగా చేసిన సంగతి మనకు తెలిసిందే.మెగా ఫ్యామిలీతో పాటు వెంకటేష్, నాగార్జున,నయనతార ఫ్యామిలీ కూడా వచ్చి ఉపాసనని ఆశీర్వదించారు. అలా రామ్ చరణ్ రెండోసారి తండ్రి కాబోతున్నాడు అనే విషయం తెలియగానే మెగా ఫ్యాన్స్ అందరిలో ఆనందాలు వెల్లువెత్తాయి.

Chiranjeevi grandson wish will not be fulfilled

ఇదిలా ఉంటే గతంలో క్లింకార పుట్టిన సమయంలో వేణు స్వామి తగుదునమ్మా అంటూ వచ్చి క్లింకార జాతకం చెప్పి ఆమెకు రాజయోగం ఉందని, తండ్రి, తల్లి,తాత కంటే చాలా మంచి పొజిషన్లో ఉంటుంది అని చెప్పారు.కానీ రామ్ చరణ్ కి ఉపాసనకి మళ్ళీ సంతానం ఉండకపోవచ్చు అసలు ఉండదు అన్నట్లుగానే రియాక్షన్ ఇచ్చారు. అంతేకాదు రామ్ చరణ్ కి మగ సంతానం ఉండదు.చిరంజీవి ఇంట్లో అబ్బాయి పుట్టడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.(Chiranjeevi)

Also Read: Spirit Villain: స్పిరిట్ మూవీలో ‘డాంగ్ లీ’ లేడా.. విలన్ గా వివేక్ ఒబెరాయ్!!

కానీ క్లింకార తప్ప రామ్ చరణ్ కి మరొకరు పుట్టరు అని వేణు స్వామి జాతకం చెప్పినప్పటికీ అది అడ్డం తిరిగింది. రాంచరణ్ మళ్లీ తండ్రి అయ్యాడు. అంతే కాదు కవలలు పుట్టబోతున్నట్టు కూడా చెప్పారు. అయితే ఇలాంటి వేళ క్లింకార తర్వాత అసలు రామ్ చరణ్ కి పిల్లలే పుట్టారన్నావు. మరి ఇప్పుడు ఎలా పుడుతున్నారు.. ఇప్పటికైనా నీ అబద్దపు జాతకాలు మానుకొని ఇంట్లో కూర్చో.. లేదా ఏదైనా పని చేసుకొని బతుకు.. (Chiranjeevi)

Chiranjeevi grandson wish will not be fulfilled

అంతే కానీ ఇలా సెలబ్రెటీల మీద పడి జాతకాల పేరుతో డబ్బులు సంపాదించకు అంటూ మండి పడుతున్నారు ఫ్యాన్స్.ఇక వేణు స్వామి రామ్ చరణ్ గురించి చెప్పిన దాంట్లో సగం తప్పయింది. ఒకవేళ మనవడు పుడితే మాత్రం వేణు స్వామిని నమ్మేవారు కూడా ఎవరూ ఉండరు అంటున్నారు ఈ విషయం తెలిసిన నెటిజన్స్. మరి రామ్ చరణ్ కి కొడుకు పుడతాడా.. చిరంజీవి మనవడి కోరిక తీరుతుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Share your love