Katrina Kaif: ఫలించని జ్యోతిష్యం.. అప్పుడు దీపికా ఇప్పుడు కత్రినా..పప్పులో కాలేస్తున్న జ్యోతిష్యులు.!

Katrina Kaif has a son

Katrina Kaif: తాజాగా కత్రినా కైఫ్,విక్కీ కౌశల్ లకు పండంటి బాబుకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మా ఇద్దరి ప్రేమకు గుర్తుగా మాకు మగ బిడ్డ పుట్టారు అంటూ ఆ విషయాన్ని బయటపెట్టారు.అయితే ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వడంతోనే చాలామంది కత్రినా విక్కీ కౌశల్ ల అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.మా సెలబ్రిటీ జంటకు బాబు పుట్టాడు అంటూ తెగ సంతోషిస్తున్నారు. ఇక ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతోనే చాలామంది సెలబ్రిటీలు, నెటిజెన్స్ వారికి కంగ్రాట్స్ చెబుతున్నారు.

Katrina Kaif has a son

ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక విషయం నెట్టింట వైరల్ అవుతుంది. అప్పుడు దీపికా పదుకొనే విషయంలో ఇప్పుడు కత్రినా కైఫ్ విషయంలో ఇద్దరి విషయాల్లో జ్యోతిష్యులు పప్పులో కాలేశారు అంటూ ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. అదేంటంటే గతంలో దీపిక పదుకొనే ప్రెగ్నెన్సీ ఉన్న సమయంలో ఆమెకు పుట్టేది కచ్చితంగా మగ బిడ్డనే అంటూ అప్పట్లో ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ జగన్నాథ్ తెలిపారు.దీపికా రణవీర్ ల ఇంటిలోకి యువరాజు రాబోతున్నారని చెప్పారు. కానీ తీరా దీపిక డెలివరీ అయ్యాక ఆడబిడ్డ పుట్టింది అని చెప్పింది.అలా తమ పాప పేరు దువా అని కూడా పెట్టుకున్నారు.(Katrina Kaif)

Also Read: Bollywood Hero: ఆ బాలీవుడ్ హీరోకి నలుగురు హీరోయిన్లతో ఎఫైర్.. భార్య సీక్రెట్ ఎంక్వయిరీ.!

అలా దీపిక పదుకొనే విషయంలో ఆ జ్యోతిష్యుడు చెప్పిన జ్యోతిష్యం తప్పయింది.అయితే రీసెంట్గా కత్రినా కైఫ్ విషయంలో కూడా జ్యోతిష్యం తిరగబడింది అంటున్నారు కొంతమంది నెటిజన్లు.ఎందుకంటే రీసెంట్గా జ్యోతిష్యుడు అనిరుధ్ కుమార్ మిశ్రా కత్రినా కైఫ్ కి ఆడబిడ్డ పుడుతుంది అంటూ తెలిపాడు.కానీ తాజాగా కత్రినా కైఫ్ తనకి మగ బిడ్డ పుట్టాడని తెలిపింది.దీంతో అటు దీపిక విషయంలో ఇటు కత్రినా ఇద్దరి విషయంలో కూడా జ్యోతిష్యులు పప్పులో కాలేశారు.

Katrina Kaif has a son

ఫలించని జ్యోతిష్యం పప్పులో కాలుస్తున్న జ్యోతిష్యులు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి.ఏది ఏమైనప్పటికీ పుట్టబోయే బిడ్డ ఎవరు అనేది డాక్టర్లు తప్ప ఇలాంటి జ్యోతిష్యుల మాటలు నమ్మకండి ఎవరు పుడితే ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికి కొడుకు పుడతాడు అని దీపికకు చెబితే బిడ్డ పుట్టింది. బిడ్డ పుడుతుంది అని కత్రినాకి చెబితే కొడుకు పుట్టారు. దీంతో జ్యోతిష్యుల అబద్ధపు మాటలు ఎలా ఉంటాయో ఈ ఒక్క విషయంతో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు కొంతమంది జనాలు.(Katrina Kaif)

https://www.instagram.com/p/DQvma-TiHj9/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
Share your love