CJP నిరసన: డిమాండ్లు నెరవేరడంతో ఆందోళన విరమణ

CJP Protest

సీజేపీ ఆందోళనకు పూర్తి విరమణ: కేంద్రంతో ఒప్పందం కుదిరింది. మూడు కీలక డిమాండ్లు నెరవేరడంతో నిరసనకారులు ఇంటికి వెళ్లిపోయారు. శనివారం సాయంత్రం వరకు జరిగిన చర్చల తర్వాత ఈ ప్రకటన వెలువడింది.

CJP నిరసన withdraw

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తమ ఆందోళనను పూర్తిగా విరమించేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తమ మూడు డిమాండ్లను ఆమోదించడంతో నిరసనకారులు దీక్షను విరమించాలని కోరింది. ఈ విషయాన్ని పార్టీ నేత అశుతోష్ రాంకా మీడియా ముందు వెల్లడించారు.

కేంద్ర మంత్రులు జేపీ నద్దా, జితేంద్ర సింగ్ తో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. మొదటి డిమాండ్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. రెండోది నిరసనకారులపై నమోదైన కేసులు, ఎఫ్‌ఐఆర్‌లు రద్దు. మూడో డిమాండ్ నీట్ పేపర్ లీకేజీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం. ఈ మూడు డిమాండ్లు కేంద్రం అంగీకరించింది.

దీంతో నిరసనకారులు వెంటనే దీక్ష విరమించి ఇంటికి వెళ్లిపోవాలని సీజేపీ సూచించింది. భవిష్యత్ వ్యూహాలు, ఇతర సమస్యలపై మళ్లీ తెలియజేస్తామని చెప్పారు. ఈ నిర్ణయంతో పెద్ద ఎత్తున నిరసనలు ముగిశాయి.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu