Paper Leak: పేపర్ లీక్స్ పై మోదీ సంచలన ప్రకటన.. కాక్రోచ్ పార్టీ ఆందోళనలకు బ్రేక్!!

పేపర్ లీక్ విషయంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. ఢిల్లీలో నాలుగు రోజులుగా కాక్రోచ్ పార్టీ నిరసనలు కొనసాగుతున్న వేళ ప్రధాని ఎక్స్ అకౌంట్ ద్వారా స్పందించారు. పేపర్ లీక్లకు పాల్పడిన వారిని ఏ మాత్రం వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో పాటు విద్యార్థుల భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏదీ లేదని ఆయన వ్యాఖ్యానించారు.

Paper Leak కేసులపై కఠిన చర్యలు

పేపర్ లీక్లతో దేశ యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేసినట్లు కూడా ఆయన వెల్లడించారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ కాక్రోచ్ పార్టీ నిరసనలు కొనసాగిస్తోంది. ఛలో పార్లమెంట్ ఉద్రిక్తతను మరింత పెంచింది. రాహుల్ గాంధీ ప్రధాని ఇంటి వద్ద ధర్నా చేశారు. దీంతో పార్లమెంట్ సమావేశాలు స్తంభించాయి.

కాక్రోచ్ పార్టీ మాత్రం తాము చర్చలకు సిద్ధమని చెబుతోంది. తటస్థ వేదికలపై చర్చలు జరపడానికి సిద్ధమని సౌరవ్ దాస్ స్పష్టం చేశారు. మంత్రులు ప్రజలకు రావాలి లేదా జంతర్ మంతర్ వద్దకు వచ్చి చర్చలు జరపాలి అని వారు షరతు పెడుతున్నారు. భద్రతా కారణాల రీత్యా ఇక్కడ వద్దనుకుంటే దగ్గరలోని ఏదైనా తటస్థ వేదిక వద్ద చర్చలకు రావడానికి సిద్ధమని చెబుతున్నారు. బిహార్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి ప్రాంతాలు ఈ పేపర్ లీక్ కేసుల్లో ఇన్వాల్వ్ అయినట్లు సమాచారం.

ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో పేపర్ లీక్లపై ప్రభుత్వం సీరియస్ అయ్యిందని స్పష్టమైంది. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటం లక్ష్యంగా ఎన్నో చర్యలు తీసుకుంటోంది. పరీక్షా వ్యవస్థ సమగ్రతను పరిరక్షించడానికి తీసుకున్న చర్యలు ఇవి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం వలన లీక్లకు పాల్పడిన వారికి త్వరగా శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పుడు చూడాలి కాక్రోచ్ పార్టీ చర్చలకు రావడం లేదా నిరసనలు కొనసాగించడం ఎంచుకుంటుందో అని.

Share your love