CM Revanth Reddy: 8 నిమిషాలకు..రూ.80 లక్షల ఖర్చు..!

CM Revanth Reddy delhi tour

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చలేదని కిందిస్థాయిలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా మైక్ పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై ప్రశ్నిస్తే, ఎవరు తిట్టని బూతులతో రెచ్చిపోతున్నారు. అయినప్పటికీ మొన్న జూబ్లీహిల్స్ కు పోయి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగించింది. కచ్చితంగా గులాబీ పార్టీ గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పినప్పటికీ, చివరకు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. CM Revanth Reddy

CM Revanth Reddy delhi tour

అయితే అలాంటి విజయం వెనుక సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఉంది. రేవంత్ రెడ్డి ఇమేజ్ కూడా ఈ ఒక్క ఉప ఎన్నికతో పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన చేసే ఢిల్లీ టూర్లపై గులాబీ పార్టీ కొత్త చర్చ మొదలుపెట్టింది. 8 నిమిషాల కోసం 80 లక్షలు ఖర్చు చేశాడని రేవంత్ రెడ్డి పై వార్తలు వైరల్ చేస్తూ గులాబీ పార్టీ సోషల్ మీడియా పోస్టులు పెడుతోంది. సుప్రీంకోర్టు సీజేఐ ప్రమాణ స్వీకారం కార్యక్రమం హాజరుకు రేవంత్ రెడ్డి దుబారా చేసిన‌ట్లు విమ‌ర్శ‌లు చేస్తోంది. 8 నిమిషాల పర్యటనకు రూ. 80 లక్షల ఖర్చుతో ప్రత్యేక విమానంలో ఢిల్లీ పర్యటన చేసిన‌ట్లు ప్ర‌చారం చేస్తోంది. CM Revanth Reddy

Also Read: KCR: కేసీఆర్ కు మ‌రో ఎదురుదెబ్బ‌.. ఆ మాతం ప‌డిపోయిన నిధులు ?

ప్రాధాన్యత లేని పర్యటనలకు ప్రజాధనాన్ని మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్న రేవంత్… ఖజానాకు గండి కొడుతూ ప్రత్యేక విమానాన్ని షేర్ ఆటో లాగా వాడుతున్న‌ట్లు పోస్టులు వైర‌ల్ చేస్తోంది. సాధారణ విమానంలోనే ప్రయాణం చేస్తానని పదేపదే చెప్పుకొచ్చిన రేవంత్ రెడ్డి.. ఆ మాటలన్నీ అబద్ధాలేనని మరోసారి నిరూపించిన ప్రత్యేక విమానం పర్యటనలు చేస్తున్న‌ట్లు జ‌నాల్లోకి న్యూస్ తీసుకెళుతోంది. రాహుల్ గాంధీ కూడా హాజరు కానీ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్లారు ? అని నిల‌దీస్తోంది. హాజరైన ఇద్దరు సీఎంలలో రేవంత్ రెడ్డి ఉండటంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జ‌రుగుతోంది. CM Revanth Reddy

Also Read: Smriti Mandhana: ప్రియురాలితో లేచిపోయిన పలాష్.. స్మృతి వివాహం ఆగిపోవడం వెనుక షాకింగ్ విషయం..

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu