KCR: కేసీఆర్ కు ఉన్న ధైర్యం చంద్ర‌బాబుకు ఉందా? కేటీఆర్ లాగా ఉప ఎన్నికను లోకేష్‌ ఎదుర్కొంటాడా ?

KCR

KCR: తెలంగాణ రాష్ట్రంలో మొన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక జరిగిన సంఘటన తెలిసిందే. గులాబీ పార్టీ సిట్టింగ్ స్థానం కోల్పోయింది. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించేందుకు కేటీఆర్ చేసిన కృషి ఎంత కాదు. అయినప్పటికీ ఫైనల్ రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చింది. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో గెలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వెపన్స్ వాడింది. ఏ ఒక్క మార్గాన్ని వదులుకోకుండా, చాలా కష్టపడాల్సి వచ్చింది. KCR

Does Chandrababu have the courage that KCR has

స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి జూబ్లీహిల్స్ గల్లీలో ప్రచారం చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని టాక్ బయటకు వచ్చింది. కానీ పోల్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. పోలీసులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని, దానివల్లే పోల్ మేనేజ్మెంట్ లో సక్సెస్ అయినట్లు కూడా కొంతమంది చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ కు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ముచ్చెమటలు పట్టించింది ఒకే ఒక్కడు. అది ఎవరో కాదు కల్వకుంట్ల తారక రామారావు. కచ్చితంగా గెలవాల్సిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో కేవలం కేటీఆర్ కు మాత్రమే బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. హరీష్ రావు తండ్రి మరణం నేపథ్యంలో ఆయన ప్రచారానికి దూరంగానే ఉన్నారు. అయినప్పటికీ సింగిల్ హ్యాండ్ తో పార్టీని ముందుకు తీసుకువెళ్లారు. ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపించారు కేటీఆర్. దాదాపు రెండు నెలల పాటు అక్కడ కష్టపడ్డారు. KCR

Also Read: Annapurna Ramanaidu Studios: అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బల్దియా GHMC

అయితే కేటీఆర్ ఒక్కడే చూసుకోవాలి అని కెసిఆర్ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. కెసిఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఉంటే జూబ్లీహిల్స్ లో గులాబీ పార్టీ కచ్చితంగా గెలిచేదని ఒక అంచనా. అయినప్పటికీ కేటీఆర్ ను నమ్మి, ఫామ్ హౌస్ లోనే పడుకున్నాడు కేసీఆర్. అయితే ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అచ్చం కెసిఆర్ చేసినట్లు చంద్రబాబు చేయగలడా? అని వైసిపి ఏపీలో కొత్త ప్రచారాన్ని తెరపైకి తీసుకువచ్చింది. నారా లోకేష్ కు టిడిపి బాధ్యతలు అప్పగించగలడా? కెసిఆర్ లాగా సైలెంట్ గా ఉండగలడా ? జూబ్లీహిల్స్ లో కేటీఆర్ లాగా ప్రచారం చేయగలడా ? అంటూ నారా లోకేష్ ను ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. సరిగ్గా తెలుగే మాట్లాడని వాడు కేటీఆర్ లాగా ప్రచారం ఎక్కడ చేస్తాడని సెటైర్లు కూడా పేల్చుతున్నారు వైసీపీ శ్రేణులు. అయితే దీనికి టిడిపి కూడా కౌంటర్ ఇస్తోంది. నారా లోకేష్ పాదయాత్ర చేశాడు అందుకే కూటమి గెలిచిందని సరికొత్త వాదన తీసుకువస్తోంది టిడిపి సోషల్ మీడియా. KCR

Also Read: Shubman Gill: రెండో టెస్టుకు గిల్ దూరం.. ముంబైకి త‌ర‌లింపు..మ‌ళ్లీ ఏం జ‌రిగిందంటే ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu