
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ హవ స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ, అక్కడ గెలుపును మాత్రం డిసైడ్ చేసేది తెలుగుదేశం పార్టీ అని అంటున్నారు. గులాబీ పార్టీ కూడా సీనియర్ ఎన్టీఆర్ అలాగే చంద్రబాబు నాయుడు పేర్లను ప్రస్తావిస్తూ ప్రచారం చేస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ శిష్యుడే కెసిఆర్ అని.. మొన్న చనిపోయిన మాగంటి గోపీనాథ్ కూడా అలాంటి వారేనని కేటీఆర్ పదే పదే చెబుతున్నారు. టిడిపి సానుభూతి ఓటర్లందరూ గోపీనాథ్కు అండగా ఉండాలని కేటీఆర్ కోరుతున్నారు. Jubilee Hills Bypoll
Jubilee Hills Bypoll brs and congress focus on tdp voters
అదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు ఏపీలో అరెస్ట్ అయితే హైదరాబాదులో నిరసనలు చేయకూడదని కేటీఆర్ హుకుం జారీ చేశారని గుర్తు చేశారు. అలాంటి గులాబీ పార్టీకి ఓటు వేస్తే, తెలుగు తమ్ముళ్లకు నష్టమే అని రేవంత్ రెడ్డి పేర్కొంటున్నారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. Jubilee Hills Bypoll
Also Read: BRS: జూబ్లీహిల్స్ లో BRS ఓడితే..KTR రాజీనామా చేయడమేనా.. హరీష్ కు బాధ్యతలు ?
ఇలా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి ఓటర్లను తమ వైపునకు లాక్కునేందుకు రెండు పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అటు ఏపీలో కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం ఈ విషయంలో సైలెంట్ గా ఉంది. అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో పోటీ చేయనట్లుగానే భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తోంది. సర్వేలు కూడా భారతీయ జనతా పార్టీకి డిపాజిట్లు రావని తేల్చి చెప్పేశాయి. మెజారిటీ సర్వేలు మాత్రం గులాబీ పార్టీ విజయం సాధిస్తుందని తేల్చి చెప్పాయి. మరి ఎవరు గెలుస్తారో చూడాలి. Jubilee Hills Bypoll
Also Read: Jubilee Hills bypoll: మాగంటి గోపీనాథ్ కు అసలైన వారసులం మేమే..కాంగ్రెస్ స్కెచ్ అదుర్స్…





