
KCR: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై జోరుగా అత్యంత జరుగుతోంది. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది ఎన్నికల సంఘం. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉపఎన్నిక ఫలితం నవంబర్ 14వ తేదీన సాయంత్రం వరకు రానుంది. అంటే బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే గులాబీ పార్టీ తమ అభ్యర్థిని కూడా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ప్రకటించేసింది. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను ఫైనల్ చేశారు. దాదాపు నాలుగు లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా గులాబీ పార్టీ గెలుస్తుందని చాలా సర్వేలు చెబుతున్నాయి. అయితే పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేస్తే కాంగ్రెస్ కు అవకాశాలు ఎక్కువ. KCR
KCR coming out Huge public meeting in Hyderabad
అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఆ పార్టీ గెలిచే అవకాశాలు కూడా లేకపోలేదు. అటు భారతీయ జనతా పార్టీ ఏదైనా మ్యాజిక్ చేస్తే కచ్చితంగా గెలుస్తుందని అంటున్నారు. టిడిపి ఓట్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి చంద్రబాబు కూడా బిజెపి పార్టీ తరఫున ప్రచారం చేసే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఇన్ని రోజులపాటు ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ బయటికి రాబోతున్నారని తెలుస్తోంది. మరో నెల రోజుల్లోనే ఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కేసీఆర్ ప్రచారం చేయబోతున్నారట. సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోవాలంటే కచ్చితంగా కష్టపడాలి.KCR
Also Read: Ponnam Vs Adluri: దున్నపోతు వివాదం…నాకు పొన్నం క్షమాపణలు చెప్పాల్సిందే…అడ్లూరి వార్నింగ్ ?
కెసిఆర్ వస్తే ఈజీగా గెలవడం ఖాయమని సర్వేలు కూడా స్పష్టం చేశాయట. దీంతో హైదరాబాద్ మహానగరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఎన్నికలకు నాలుగు రోజుల ముందుగా ఈ సభ ఉండే ఛాన్స్ ఉంది. అంటే నవంబర్ 7వ తేదీన సభ నిర్వహించే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సభ నేపథ్యంలో దాదాపు 5 లక్షల మంది వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. ఇతర నియోజకవర్గాల నుంచి ప్రజలను తెప్పించి మరి సభ సక్సెస్ చేయాలని అనుకుంటున్నారట. అటు కేటీఆర్ అలాగే హరీష్ రావు కూడా గ్రౌండ్ స్థాయిలో ప్రచారం మొదలుపెట్టారు. సెంటిమెంట్ వర్కౌట్ అయితే కచ్చితంగా గులాబీ పార్టీ విజయం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. KCR
Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యాతో విడాకులు తీసుకున్న టాలీవుడ్ హీరోయిన్ రిలేషన్… త్వరలోనే వివాహం…!





