CM Joseph Vijay: ప్రోటోకాల్ పక్కన పెట్టి జూనియర్ డాక్టర్ను ఆలింగనం చేసుకున్న సీఎం

చెన్నైలో ఆరోగ్యశాఖ నియామకాల కార్యక్రమంలో సీఎం జోసెఫ్ విజయ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ జూనియర్ డాక్టర్ తనని hug చేసుకోవడానికి అనుమతి అడగ్గా, ప్రోటోకాల్స్ పక్కన పెట్టి ఆయన ఆప్యాయంగా కౌగలించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ప్రజలు సీఎంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

CM Joseph Vijay Hugs Jr Doctor

చెన్నైలో గురువారం జరిగిన appointment letter పంపిణీ కార్యక్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్టేజీపై నుంచి నియామక పత్రం తీసుకోవడానికి వచ్చిన ఓ జూనియర్ డాక్టర్, సర్ప్రైజ్గా సీఎంని hug చేసుకోవడానికి అనుమతి కోరారు. అందుకు సీఎం విజయ్ చిరునవ్వుతో ఒప్పుకుంటూ, ఆ డాక్టర్ని ఆప్యాయంగా కౌగలించుకున్నారు. అనంతరం డాక్టర్ తన appointment order అందుకుని సంతోషంగా వెళ్ళిపోయారు.

ఈ ప్రోగ్రామ్లో భాగంగా తమిళనాడు హెల్త్ డిపార్ట్మెంట్లో ఎంపికైన మొత్తం 2,144 మంది క్యాండిడేట్లకు నియామక పత్రాలు అందించారు. అందులో 751 మంది అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు, 1,393 మంది హెల్త్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. సీఎం విజయ్ ఈ అభ్యర్థులందరికీ వ్యక్తిగతంగా appointment letters అందించడం విశేషం.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నుంచి విజయ్ ప్రోటోకాల్ పక్కన పెట్టి ప్రజలతో కలిసిపోతున్నారు. గతంలో ఓ గర్భిణీ అభ్యర్థి కోసం స్టేజీ దిగి నేరుగా కిందకు వచ్చి నియామక పత్రం అందించి అందరి మన్ననలు పొందారు. సీఎం హోదాలో ఉన్నా సామాన్యులతో స్నేహంగా మెలగడం చూసి నెటిజన్లు, అభిమానులు సీఎంను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Share your love