David Warner: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దోషిగా తేలిన క్రికెటర్ డేవిడ్ వార్నర్

David Warner in drunk driving incident

డేవిడ్ వార్నర్ ను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దోషిగా తేల్చింది సిడ్నీ కోర్టు. ఏప్రిల్ నెలలో మద్యం తాగి వాహనం నడిపిన ఆస్ట్రేలియన్ క్రికెటర్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తర్వాత బెయిల్ పై విడుదలైన వార్నర్ నేరాన్ని అంగీకరించాడు.

David Warner drunk driving case

కోర్టు విచారణలో వార్నర్ తప్పు ఒప్పుకోవడంతో శిక్ష ఖరారు తేదీని వచ్చే నెల 18కి వాయిదా వేశారు. ఈ కేసులో వార్నర్ కు ఎలాంటి శిక్ష పడుతుందో అప్పుడు తేలుతుంది.

డేవిడ్ వార్నర్ ఇప్పటికే క్రికెట్ నుంచి రిటైర్ అయినా, అతని పేరు ఇలా వార్తల్లో నిలుస్తోంది. ఈ ఘటనతో అతని ఇమేజ్ కు కొంత నష్టం వాటిల్లింది.

సిడ్నీ పోలీసులు ఏప్రిల్ లో వార్నర్ ను చెక్ చేసినప్పుడు అతను మద్యం తాగినట్లు గుర్తించారు. దీంతో అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. ఇప్పుడు కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు.

Visited 1 times, 1 visit(s) today

Leave a Comment