Fenugreek seeds: మొలకెత్తిన మెంతులతో ఆరోగ్య రహస్యాలు..!

Health Benefits With Fenugreek seeds

Fenugreek seeds: ఆయుర్వేద వైద్యంలో మెంతులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మెంతులు ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాలా రకాల ఆయుర్వేద మందులలో మెంతులను వాడుతారు. మెంతులు ఆరోగ్యానికే కాకుండా చర్మ సౌందర్యానికి, జుట్టు సమస్యలకు ఎంతగానో పనిచేస్తుంది. డయాబెటిక్ వ్యాధులకు మెంతులు ఒక వరమనే చెప్పవచ్చు. డయాబెటిక్ పేషెంట్లు మెంతులను తప్పకుండా తినాలి. మెంతులు తిన్నట్లయితే వారి షుగర్ సాధారణ స్థితికి వస్తుంది. క్రమక్రమంగా షుగర్ పూర్తిగా తగ్గుతుంది.

Also Read: KCR: జగన్ తో పొంగులేటి సమావేశం… కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం పక్కనా?

Health Benefits With Fenugreek seeds

మెంతులను పేస్ట్ చేసుకుని చర్మానికి పట్టించినట్లయితే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. మచ్చలు, మొటిమలు లాంటి సమస్యలు తొలగిపోతాయి. మెంతులను పొడి చేసుకొని కొద్దిగా పెరుగు కలిపి ముఖానికి ప్రతిరోజు పెట్టుకున్నట్లయితే ఎలాంటి పార్లర్లకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇక మెంతులతో హెయిర్ ఆయిల్ కూడా తయారు చేసుకుంటారు. మెంతులను నూనెలో కాసేపు మరగబెట్టి జుట్టుకు పట్టించినట్లయితే జుట్టు ఊడడం, చుండ్రు సమస్యలు తొలగిపోతాయి. జుట్టు బలంగా, ఒత్తుగా తయారవుతుంది. ఇక మొలకెత్తిన మెంతులు శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

Also Read: KCR: జగన్ తో పొంగులేటి సమావేశం… కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం పక్కనా?

మొలకెత్తిన మెంతులలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మొలకెత్తిన మెంతులను తినడం వల్ల మధుమేహం తగ్గుతుంది. బరువు తగ్గడం లాంటి సమస్యలు తొలగిపోతాయి. జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. మొలకెత్తిన మెంతులను తిన్నట్లయితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు మెంతులను తినడం వల్ల జుట్టుకు అధికంగా బలం ఏర్పడుతుంది. ప్రతిరోజు ఉదయంపూట మొలకెత్తిన మెంతులను తినాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు.

Also Read: Asia Cup 2025: ఆసియా కప్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu