Balagam Venu: “బలగం వేణు”ని తొక్కేస్తుంది వారేనా.. “ఎల్లమ్మ” ప్రాజెక్టును ఆపుతూ..!

Are they the ones who will trample on "Balagam Venu"

Balagam Venu: బలగం సినిమాతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారారు. కమెడియన్ వేణు జబర్దస్త్ లో వేణు వండర్స్ అనే టీంలో తన కామెడీతో ఎంతో మందిని మెప్పించిన వేణు ఆ తర్వాత సినిమాల్లో కామెడీ రోల్స్ చేస్తూ ఇండస్ట్రీలో రాణించారు.అయితే అలాంటి వేణు బలగం సినిమాతో సినిమా తీసి దర్శకుడిగా మారారు. అలా చిన్న సినిమాగా వచ్చిన బలగం మూవీ అతిపెద్ద హిట్ కొట్టడంతో పాటు వేణు పేరు దేశవ్యాప్తంగా తెలిసేలా చేసింది.ఇక ఈయన తెరకెక్కించిన బలగం సినిమాకి 100 కి పైగా అవార్డులు వచ్చాయి.

Are they the ones who will trample on “Balagam Venu”

అయితే అలాంటి బలగం సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన వేణు నెక్స్ట్ తీసే మూవీపై అందరిలో ఒక ఆసక్తి అయితే నెలకొంది.అయితే ఆ మూవీ పేరు ఎల్లమ్మ అని కూడా అనౌన్స్ చేశారు.అలా ఎల్లమ్మ మూవీ కోసం ఎంతోమంది హీరోలను అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఒక్కొక్కరిగా సినిమా నుండి తప్పుకుంటున్నారు. అలా నితిన్,కార్తీ,బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నాని ఇలా ఎంతో మంది హీరోల పేర్లు వినిపించాయి. కానీ వీరెవరు కూడా ఈ సినిమాలో కొనసాగడం లేదు. (Balagam Venu)

Also Read: Rashmika Mandanna: 9 to 6 వర్క్ షెడ్యూల్ సినిమా పరిశ్రమకు అవసరం.. రష్మిక మందన్నా ఆసక్తికర వ్యాఖ్యలు!!

మొదట నానితో తెరకెక్కించాలి అనుకున్నప్పటికీ నాని రిజెక్ట్ చేయడంతో నితిన్ ని అనుకున్నారు.అలా నితిన్ సాయి పల్లవి కాంబో అనుకున్నప్పటికీ సాయిపల్లవి రిజెక్ట్ చేయడంతో కీర్తి సురేష్ ని తీసుకున్నారు. ఇక నితిన్ కీర్తి సురేష్ ల కాంబోలో ఎల్లమ్మ ప్రాజెక్టు ముందుకు వెళుతుంది అనుకున్నారు. కానీ సడన్గా నితిన్ అందులో నుండి తప్పుకున్నట్టు తెలిసింది.అయితే తాజాగా దేవిశ్రీప్రసాద్ సినిమాలో హీరోగా చేస్తున్నట్టు టాలీవుడ్ సినీ సర్కిల్స్ నుండి వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు.

Are they the ones who will trample on "Balagam Venu"

ఇదంతా పక్కన పెడితే దిల్ రాజు నిర్మాతగా వేణు ఎల్లమ్మ మూవీకి ఎంత సపోర్ట్ చేస్తున్నా కూడా ఆయన్ని కావాలనే కొంతమంది తోక్కేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వేణు చేసే ఎల్లమ్మ మూవీ కూడా హిట్ అయితే ఇక ఆయన్ని బీట్ చేసే డైరెక్టర్ ఉండరు అనే వార్తలు వినిపించడంతో కావాలనే కొంతమంది వేణు ఎల్లమ్మ ప్రాజెక్టు ముందుకు వెళ్లకుండా చేస్తున్నారనే రూమర్లు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే వేణుని డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఎదగనివ్వడం లేదా ఆయన్ని ఎవరైనా తొక్కేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.(Balagam Venu)

Share your love