
ఉత్తరప్రదేశ్ పాలిటిక్స్‌లో ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ దివ్య మిట్టల్ రిజైనేషన్ హాట్ టాపిక్‌గా మారింది. 2013 బ్యాచ్‌కు చెందిన ఈ సీనియర్ యూపీ క్యాడర్ ఆఫీసర్, తన 13 ఏళ్ల సివిల్ సర్వీస్ జర్నీకి సడన్‌గా గుడ్ బై చెప్పారు. లండన్‌లో హై-పేయింగ్ జాబ్ వదిలేసి, ఐఐటీ-ఐఐఎం చదువుల తర్వాత యూపీఎస్సీ క్లియర్ చేసి దేశానికి సేవ చేద్దామని వచ్చిన ఆమె, కేవలం రెండు లైన్ల రెసిగ్నేషన్ లెటర్‌తో తన పదవికి రాజీనామా చేయడం అందరినీ షాక్‌కు గురిచేసింది.
Why Divya Mittal Quit IAS
లండన్‌లో కార్పొరేట్ ఉద్యోగం వదిలి ఇండియాకు వచ్చిన దివ్య మిట్టల్, సివిల్ సర్వీసెస్‌లో అద్భుతమైన సర్వీస్ అందించారు. ఆమె తన 13 ఏళ్ల కెరీర్‌లో ప్రజలకు ఎన్నో మంచి పనులు చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు పైప్ ద్వారా తాగునీరు అందించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అయితే, వ్యక్తిగత మరియు ఫ్యామిలీ రీజన్స్ వల్లే తాను ఈ జాబ్ వదులుకుంటున్నట్లు రెసిగ్నేషన్ లెటర్‌లో కేవలం రెండు లైన్లలో ఆమె స్పష్టం చేయడం విశేషం.
ఆమె సడన్ రిజైనేషన్ వెనుక పొలిటికల్ ఎంట్రీ ఉంటుందనే రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ ఈ విషయంపై స్పందిస్తూ గవర్నర్ జోక్యానికి డిమాండ్ చేశారు. ఆన్‌లైన్‌లో జరుగుతున్న ఈ చర్చలపై దివ్య మిట్టల్ స్పందిస్తూ, “సరియైన సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడుతాను, ఈ దేశం నాకు ఇచ్చిన కలలను నేను వదిలిపెట్టను” అని క్లారిటీ ఇచ్చారు.
పోస్ట్ ముగిసినా తన కలలు ఆగవని, ప్రజలకు సేవ చేసే అవకాశం వేరే రూపంలో కొనసాగుతుందని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఆమె ఎలాంటి పొలిటికల్ పార్టీలో జాయిన్ అవుతారనే దానిపై క్లారిటీ లేదు కానీ, త్వరలోనే ఆమె తన నెక్స్ట్ ప్లాన్స్ గురించి అఫీషియల్‌గా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఐఐటీ-ఐఐఎం బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఈ టాలెంటెడ్ బ్యూరోక్రాట్ ఫ్యూచర్ మూవ్స్ ఏంటనేది ఇప్పుడు యూపీ పాలిటిక్స్‌లో చర్చనీయాంశమైంది.
👉 ఇంకా చదవండి: Nepal Floods: నేపాల్‌లో వరదలు, 2500 మంది గల్లంతు







