
Popula Pette: వంట గదిలో మసాలా పెట్టే అనేది తప్పకుండా ఉంటుంది. స్త్రీలు మసాలా పెట్టెను ఎక్కువగా వాడుతారు. ఇందులో వంటకు అవసరమైన సుగంధ ద్రవ్యాలను నిల్వ చేసుకుంటారు. సాధారణంగా పోపుల పెట్టెలో ఆవాలు, మిరియాలు, జీలకర్ర, పసుపు, మెంతులు, వెల్లుల్లి లాంటి పదార్థాలు ఉంటాయి. సాధారణంగా మసాలా పెట్టెలో ఆరు పెట్టెలు ఉంటాయి. అయితే ఈ పెట్టెలు ఎక్కువగా ఉన్నాయని చాలామంది ఇష్టం వచ్చిన వస్తువులను నిల్వ చేస్తూ ఉంచుతారు. కొన్ని రకాల వస్తువులను పోపుల పెట్టెలో ఉంచితే అది తొందరగా పాడవుతాయి. పోపుల పెట్టెలో పొరపాటున కూడా ఉప్పును పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. ఉప్పుకు తేమను గ్రహించే గుణం అధికంగా ఉంటుంది.
Financial Lessons Amma Popula Pette
కాబట్టి ఇతర సుగంధ ద్రవ్యాలతో కలిపి ఉప్పును నిలువ చేసినట్లయితే దాని రుచి పూర్తిగా తగ్గిపోతుంది. ఉప్పును విడివిడిగా వేరే సీసాలలో నిలువ చేయాలి. ఇక చాలామంది స్త్రీలు పోపుల పెట్టెలో డబ్బులు దాచుకుంటారు. అందులో చాలా సౌకర్యంగా ఉంటుందని తీసి ఇవ్వడానికి వీలుగా ఉంటుందని చాలామంది పోపుల పెట్టెలో డబ్బులు దాచుకుంటారు. అయితే ఇలా చేయడం వల్ల అసలు మంచిది కాదని పండితులు చెబుతున్నారు. పోపుల పెట్టెలో పొరపాటున కూడా కొబ్బరినూనె, ఆవనూనె, నువ్వుల నూనె లాంటి నూనెలను అస్సలు నిల్వ చేయకూడదు. ఇలా నిల్వ చేయడం వల్ల అవి ఒకదానితో ఒకటి కలిసి పోతాయి. దానివల్ల పూర్తిగా రుచి మారిపోతుంది. పోపుల పెట్టెలో బియ్యం, పప్పు, చెక్కర లాంటి వస్తువులను పొరపాటున కూడా నిల్వ చేయకూడదు. వీటిని విడివిడిగా ఇతర పెట్టెలలో నిలువ చేసుకోవాలి. చాలామంది స్త్రీలు పోపుల పెట్టెలో కరివేపాకు పెడతారు. కరివేపాకు తేమ అధికంగా ఉంటుంది. దానివల్ల పోపుల పెట్టలో ఉన్న సుగంధ ద్రవ్యాలు తొందరగా క్షీణిస్తాయి. వాటికి బూజు అధికంగా పడుతుంది.
Also Read: Marriage: పెళ్లికూతురు మెడలో 3 ముళ్ళు ఎందుకు వేస్తారు….అసలు తాళిబొట్టు ఎందుకు కడతారు…!
అందుకే పోపుల పెట్టెలో కరివేపాకును పెట్టకూడదు. ఇక పోపుల పెట్టెలో పొరపాటున కూడా నువ్వులను ఉంచకూడదు. నువ్వులు శని దేవునికి ఇష్టమైన వస్తువు. పోపుల పెట్టెలో నువ్వులు పెట్టడం వల్ల కుటుంబంలో అనేక రకాల సమస్యలు సంభవిస్తాయి. అలా చేయడం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితిపై పూర్తిగా ప్రభావం పడుతుంది. ఇంట్లో పొరపాటున కూడా పోపుల డబ్బాలో నువ్వులు పెట్టకుండా చూసుకోవాలి. నువ్వులు పోపుల డబ్బాలో పెట్టినట్లయితే కుటుంబంలో అనారోగ్యం సంభవిస్తుంది. ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. సంపద క్షీణిస్తుంది. తరచూ గొడవలు జరుగుతాయి. ఆ కారణంగానే పోపుల పెట్టెలో పొరపాటున కూడా నువ్వులు, ఉప్పు పెట్టకూడదని పండితులు చెబుతున్నారు. కేవలం పోపుల పెట్టేలో జిలకర, ఆవాలు, మెంతులు, మిరియాలు, యాలకులు, లవంగాలు మాత్రమే నిల్వ చేసుకోవాలి.
Also Read: Balayya: బాలయ్య అఖండ సక్సెస్ వెనుక జగన్… పేర్నినాని సంచలనం !




