
Bathroom Vastu: ఇంట్లో బాత్రూం విషయంలో చాలామంది వాస్తు నియమాలను పాటిస్తారు. కొంతమంది ఉత్తరం దిశలో బాత్రూం కట్టుకుంటే మరి కొంత మంది వాయవ్య దిశలో కట్టుకుంటారు. కానీ దక్షిణ, ఆగ్నేయ, నైరుతి దిశలలో బాత్రూం కట్టుకున్నట్లయితే దరిద్రం ఇంటికి పట్టుకుంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. బాత్రూంలో వాటర్ బకెట్ పెట్టినట్లయితే ఎప్పుడూ నీటితో నింపి ఉంచాలి. కాళీ బకెట్ ఎప్పుడు బాత్రూంలో పెట్టకూడదు. ఒకవేళ ఖాళీగా పెట్టినట్లయితే బోర్లించి మాత్రమే పెట్టాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. బాత్రూం డోర్ ముందు అద్దం అస్సలు పెట్టకూడదు. కొంతమంది బాత్రూం నుంచి బయటకు రాగానే అద్దంలో చూసుకుంటూ వస్తారు. Bathroom Vastu
Bathroom Vastu Be careful if you put these items in the bathroom
అలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు ఆకర్షిస్తాయి. ఒకవేళ ఇంట్లో బాత్రూం ముందు అద్దం ఉన్నట్లయితే వెంటనే తొలగించాలి. ఇలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. బాత్రూంలో ఎప్పుడూ ట్యాప్ లీక్ కాకుండా చూసుకోవాలి. బాత్రూంలో టాప్ వాటర్ లీక్ అయినట్లయితే ఆర్థిక నష్టాలు, ఇంట్లో గొడవలు ఏర్గొడవలు. బాత్రూంలో టాప్ లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక నేటి కాలంలో చాలామంది బాత్రూంలో గీజర్, ఫ్యాన్ లాంటి వస్తువులను పెట్టుకుంటున్నారు. ఇలా బాత్రూంలో పెట్టుకున్నట్లయితే ఆగ్నేయం దిశలో మాత్రమే ఫ్యాన్, గీజర్, స్విచ్ బోర్డ్ లను అమర్చుకోవాలి. వేరే దిశలలో పెట్టినట్లయితే ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. బాత్రూంకు తప్పకుండా వెంటిలేషన్ ఉండే విధంగా చూసుకోవాలి. అది తూర్పు, ఉత్తరం, పడమర దిశలలో మాత్రమే ఉండే విధంగా చూసుకోవాలి. బాత్రూంకి వెంటిలేషన్ ఉన్నట్లయితే నెగటివ్ ఎనర్జీ అందులోంచి బయటకు వెళ్ళిపోతుందని నిపుణులు చెబుతున్నారు. Bathroom Vastu
Also Read: Jagan: జగన్ కు గండం మారిన అల్లుడు.. వైయస్ వారసుడిగా రంగంలోకి ?
బాత్రూమ్ కు మెటల్ డోర్ ఆమర్చడం వల్ల ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది. దానికి బదులుగా చెక్క తలుపులు పెట్టుకోవాలని వాస్తు పండితులు సూచనలు చేస్తున్నారు. పూజ గది వంటగదికి ఆనుకొని బాత్రూం గోడను ఎప్పుడూ ఉంచకూడదు. అలా బాత్రూం గోడ వైపుగా మంచాన్ని కూడా అస్సలు పెట్టుకోకూడదు. అలా చేయడం వల్ల ప్రతికూల శక్తులను ఆకర్షిస్తాయి. బాత్రూంలో టైల్స్ గానీ, గోడలకు గానీ ఎప్పుడు లేత రంగులను మాత్రమే వాడాలి. ముదురు రంగులను బాత్రూంలో ఉపయోగించకూడదు. దానివల్ల నెగిటివ్ ఎనర్జీ తొందరగా ఆకర్షిస్తుంది. అలాంటి రంగులను పెట్టుకోవడం వల్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది. లేత రంగులను బాత్రూంలో వాడడం వల్ల చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనసుకు హాయిగా ఉంటుంది. ఇక కొంతమంది బాత్రూంకి ఫోన్లను తీసుకెళ్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. బాత్రూంలో ఫోన్లను వాడడం వల్ల బ్యాక్టీరియా ఫోన్లపై పడుతుంది. ఆ తర్వాత ఆ ఫోన్లను మనం వాడడం వల్ల బ్యాక్టీరియా మొత్తం శరీరం అంతటా వ్యాపించి అలర్జీ దురద లాంటి సమస్యలు ఏర్పడతాయి. అంతేకాకుండా బాత్రూంలో ఫోన్లను ఉపయోగించడం వల్ల వాస్తు ప్రకారం అసలు మంచిది కాదని పండితులు చెబుతున్నారు. Bathroom Vastu
Also Read: Renu Desai: పవన్ కళ్యాణ్ తప్ప నీ లైఫ్ లో వేరే మగాడు ఉండకూడదు.. రేణు దేశాయ్ కి ఫ్యాన్స్ వార్నింగ్.?




















