Toothbrush: ఒకే బ్రష్ లను ఎక్కువ రోజులు వాడుతున్నారా…అయితే ప్ర‌మాద‌మే?

Toothbrush: ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే చాలామంది చేసే పనిలో మొదటిది బ్రష్ వేయడం. పూర్వకాలంలో చాలామంది బ్రష్ లను వాడేవారు కాదు తరచూ వేప పుల్లలను వేసుకొని పళ్ళను తోమేవారు. వేప పుల్లలతో పళ్ళను తోమడం వల్ల వారి పళ్ళు ఎంతో బలంగా, తెల్లగా తయారయ్యేవి. ఇక వేప పుల్లలను మానేసిన అనంతరం ఎక్కువగా ప్రతి ఒక్కరూ బ్రష్ ను వాడుతున్నారు. అయితే చాలామంది తెలిసో తెలియకో బ్రష్ లను రెండు మూడు నెలలు ఒకటే వాడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అసలు మంచివి కాదని వైద్యులు చెబుతున్నారు. బ్రష్ లను తప్పకుండా నెలలో ఒకసారి తప్పకుండా మార్చాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.

Do you use the same Toothbrushes for a long time

ఒకే బ్రష్ ను రెండు మూడు నెలలపాటు వాడడం వల్ల ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. కేవలం నెల రోజులు మాత్రమే వాడాలి. అంతకుమించి వాడినట్లయితే అందులో క్రీములు అధికంగా చేరి పళ్ళు పూర్తిగా పాడై పోతాయి. దానివల్ల పళ్లకు బలం చేకూరదు. పళ్లను శుభ్రం చేసుకున్న కూడా అవి ఏమాత్రం శుభ్రం కావు. అధికంగా క్రీములు పళ్ల లోపలికి చేరుతాయి. దానివల్ల పళ్ళు పుచ్చిపోవడం, పళ్ళు విరిగిపోవడం లాంటి సమస్యలు ఏర్పడతాయి. అందుకే తప్పకుండా నెలకు ఒకసారి బ్రష్లను మార్చుతూ ఉండాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. ఇక ఇవి మాత్రమే కాకుండా చాలా మంది లోదుస్తులను సంవత్సరాల తరబడి ఒకే రకమైన వాడుతారు. దాని వల్ల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. లోదుస్తులను మూడు నెలలకు మించి వాడకూడదని వైద్యులు చెబుతున్నారు.

Also Read: Guava: వర్షాకాలంలో జామ చెట్టుకు మొక్కాల్సిందే…ఇది తింటే కాన్సర్ తో పాటు 100 రోగాలకు…

మూడు నెలల అనంతరం వాటిని తప్పకుండా మార్చాలని అదే పనిగా ఒకే రకమైన లోదుస్తులను వాడినట్లయితే ఎలర్జీ సమస్యలు, స్కిన్ ఇన్ఫెక్షన్లు తలెత్తయని వైద్యులు చెబుతున్నారు. దానివల్ల చర్మం పూర్తిగా పాడవడం లాంటి సమస్యలు అధికంగా వస్తాయి. ఇక కిచెన్ లలో వాడే స్క్రబ్బర్ లను వారానికి ఒకసారి మార్చాలి. లేకపోయినట్లయితే అందులో అనేక రకమైన సూక్ష్మ క్రిములు చేరుకొని పాత్రలకు అంటుకుంటాయి. అలాంటి పాత్రలలో మనం తినడం వల్ల చాలా రకాల ఇన్ఫెక్షన్లు కడుపులోకి చేరుకుంటాయి. ఈ నియమాలను పాటించినట్లయితే ఆరోగ్యానికి, చర్మానికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.

Also Read: Ponguleti Srinivas: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ బయోపిక్.. హీరో ఎవరంటే?