Teenmar Mallanna: తీన్మార్ మ‌ల్ల‌న్న వెనుక కేసీఆర్‌…పార్టీ పేరుతో స్కెచ్ ?

Teenmar Mallanna

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయాలు నడుస్తున్నాయి. ఒకప్పుడు రాజకీయాలంటే ఆంధ్రప్రదేశ్ పేరు మాత్రమే చెప్పేవారు. ఏపీలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఇప్పుడు తెలంగాణలో బీసీ నినాదంతో కొత్త రాజకీయాలు కొనసాగుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి… బీసీ ముఖ్యమంత్రులే నినాదంతో అన్ని పార్టీలు ముందుకు వెళ్లే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీలో బీసీ నినాదం ఎత్తుకున్నాయి. Teenmar Mallanna

Also Read: Ponguleti Srinivas: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ బయోపిక్.. హీరో ఎవరంటే?

KCR is behind Teenmar Mallanna

ప్రాంతీయ పార్టీ అయిన గులాబీ పార్టీకి ఆ ఛాన్స్ లేదు. అయినప్పటికీ కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతే చాలని చాలామంది తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఆ పార్టీలో బీసీలకు కీలక పదవులు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్న బీసీల రాజ్యాధికారం పేరుతో కొత్త పార్టీని తీసుకువచ్చారు. అయితే ఈ పార్టీ వెనుక కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Also Read: Guava: వర్షాకాలంలో జామ చెట్టుకు మొక్కాల్సిందే…ఇది తింటే కాన్సర్ తో పాటు 100 రోగాలకు…

బీసీ నినాదంతో కాంగ్రెస్ ముందుకు వెళుతున్న నేపథ్యంలో… బీసీల ఓట్లు చీల్చేందుకు తీన్మార్ మల్లన్న తో కేసీఆర్ స్కెచ్ వేసినట్లు చెబుతున్నారు. అప్పుడు గులాబీ పార్టీకి పడే అన్ని ఓట్లు ఆ పార్టీకే వెళ్తాయి. అప్పుడు అవలీలగా కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందని కొంతమంది చర్చించుకుంటున్నారు. మరి ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ.. కాంగ్రెస్ అలాగే బిజెపి పార్టీల సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుంది.

Also Read: Break Fast: బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా…అయితే ప్ర‌మాదం తెచ్చుకున్న‌ట్లే?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu