మంగమ్మ గారి మనవడు

Anchor Ravi: బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో కార్యక్రమాలకి యాంకరింగ్ చేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు రవి. లాస్య మరియు శ్రీముఖి లాంటి వాళ్లకి కోయాంకర్ గా చేశాడు కూడా. యాంకర్ రవి తన జీవితంలో ఎంత గుర్తింపు సంపాదించుకున్నాడు అదే స్థాయిలో వివాదాలు కూడా ఎదుర్కొన్నాడు. అతడు టీవీ షో చేసిన బిగ్బాస్ లో పాల్గొన్న ఎక్కువగా వివాదాల్లోనే హైలెట్ అయ్యాడు. యాంకర్ రవి రీసెంట్గా రీతు చౌదరి హోస్ట్ గా వ్యవహరిస్తున్న దావత్ అనే కార్యక్రమానికి హాజరయ్యాడు.

Anchor Ravi’s wife was insulted

ఇక రీతు గెస్ట్ లని వివాదాస్పద ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయడం మనందరం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా యాంకర్ రవి పర్సనల్ లైఫ్ కి సంబంధించిన వివాదాలని రీతు బయటకి తీసుకువచ్చింది. గతంలో యాంకర్ లాస్య మధ్య ఎటువంటి రూమర్స్ వచ్చాయో తెలిసింది. వాటి గురించి కూడా రీతూ ప్రశ్నించింది. రవి కూడా ఏ మాత్రం తగ్గకుండా అన్ని వివాదాలకు బోల్డ్ గా సమాధానం ఇచ్చారు. యాంకర్ రవి పక్క కమర్షియల్ అంటగా అని ప్రశ్నించింది రీతు. దానికి రవి బోల్డ్ గా రిప్లై ఇచ్చాడు. ” 100% నేను కమర్షియల్.. ఎవరేమనుకున్నా ఇది నిజం.

Also Read: Sathyam Rajesh: అక్కినేని నాగేశ్వరరావుని పెళ్లికి పిలిస్తే అవమానించారు…!

ఎందుకంటే విరాట్ కోహ్లీని గల్లీ లో ఫ్రీగా క్రికెట్ ఆడమంటే ఆడతాడా? తన స్కిల్ కి తగ్గట్లుగా డబ్బు తీసుకుంటున్నాడు కదా. నేను కూడా అంతే. నాకు వచ్చిన పనిని డబ్బులు తీసుకుని మాత్రమే చేస్తా ” అని చెప్పుకొచ్చాడు రవి. ఇక అనంతరం.. ఎందుకు మీకు పెళ్లి అయిన విషయం ఎక్కువ రోజులు రివీల్ చేయలేదు అని రీతూ ప్రశ్నించగా.. దానికి రవి సమాధానం ఇచ్చాడు. ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఒక సంచలన నిజం బయటపడింది.

Anchor Ravi's wife was insulted

అది అలాంటి ఇలాంటి సంఘటన అయితే కాదు. ఏ మహిళా కూడా భరించలేని అవమానం తన భార్యకి ఎదురైంది. యాంకర్ లాస్యతో రూమర్స్ వస్తున్నావ్ సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఉంది. తన భార్యతో కలిసి ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళాడట రవి. అక్కడ కొందరు తన భార్యతో రవి భార్య ఆ యాంకర్ కదా.. నువ్వేంటి నా మొగుడు అని చెప్పుకుని తిరుగుతున్నావు అని అడిగారట. దీనితో నా భార్య భరించలేకపోయింది.. ఏ మహిళ అయినా తన భార్యని ఇంకొకరి భర్త అంటే సహించలేదు. రూమర్స్ వల్ల అలాంటి అవమానాలు నా భార్య ఎదుర్కొంది.. అంటూ ఇంటర్వ్యూలో తెలియజేశాడు రవి.(Anchor Ravi)

Join WhatsApp