Did heroine Sneha get married to another person before Prasanna

Sneha: హీరోయిన్ స్నేహ ఇప్పటి తరం సినీ ప్రేక్షకులకు కూడా తెలిసిన హీరోయినే.ఈమె వయసు పెరిగినా కూడా తరగని అందంతో పెళ్లయి పిల్లలు పుట్టినా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలా ఉందో ఇప్పుడు అంతకంటే అందంగా ఉంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ నటుడు ప్రసన్న కుమార్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ప్రసన్న కంటే ముందే స్నేహ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది అంటూ అప్పట్లో కోలీవుడ్ మీడియా కోడై కూసింది.

Did heroine Sneha get married to another person before Prasanna

మరి నిజంగానే హీరోయిన్ స్నేహ ప్రసన్న కుమార్ కంటే ముందు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందా.. అసలు జరిగిన సంగతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తమిళంలో నటుడిగా.. ఫిలిం జర్నలిస్టుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన బయిల్వాన్ రంగనాథన్ ఎంతోమంది సెలబ్రెటీల పర్సనల్ విషయాలను వారి ఎఫైర్లను, ఎవరికి తెలియని సీక్రెట్ లను బయటపెడుతూ ఉంటారు.(Sneha)

Also Read: Sathyam Rajesh: అక్కినేని నాగేశ్వరరావుని పెళ్లికి పిలిస్తే అవమానించారు…!

అలా ఓ ఇంటర్వ్యూలో స్నేహ గురించి ఆయన మాట్లాడుతూ.. హీరోయిన్ స్నేహ నటుడు ప్రసన్నకుమార్ ని పెళ్లి చేసుకునే కంటే ముందే సినీ ఇండస్ట్రీకి చెందిన మరో ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకోవాలనుకుంది. అంతేకాదు ఆయనతో ప్రేమాయణం సాగించి నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఇక ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో స్నేహ,నిర్మాత నాగ రవి డైమండ్ రింగ్స్ మార్చుకున్నారు.

Did heroine Sneha get married to another person before Prasanna

అయితే పెళ్లికి కొద్ది రోజులు ఉంది అనగా ఆ నిర్మాతకు సంబంధించిన పర్సనల్ విషయాలు అంటే నిర్మాతకు వేరే అమ్మాయిలతో ఉన్న ఎఫైర్స్ అన్ని బయటపడడంతో అన్ని తెలిసిన స్నేహ తనతో జీవితాన్ని పంచుకోలేనని ఆయనకి బ్రేకప్ చెప్పి ఎంగేజ్మెంట్ ని రద్దు చేసుకుంది. ఆ తర్వాత ప్రసన్నకుమార్ తో ప్రేమలో పడి అతన్ని వివాహం చేసుకొని పిల్లాపాపలతో సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది. అంటూ ఒక షాకింగ్ విషయాన్ని కోలీవుడ్ ఫిలిం జర్నలిస్ట్ అయిన బయిల్వాన్ రంగనాథన్ బయటపెట్టారు.(Sneha)

Join WhatsApp