The star hero who held Soundarya legs

Soundarya: సౌందర్యని ఆ స్టార్ హీరో ఓ పని కోసం కాళ్లు పట్టుకొని అడిగినా కూడా ఒప్పుకోలేదట.. మరి ఆ హీరో ఎవరు? ఎందుకు సౌందర్య కాళ్లు పట్టుకున్నారు. అసలు జరిగిన సంగతి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. సౌందర్య క్రేజ్ అప్పట్లో ఎలా ఉండేది అంటే ఆమె ఒక హీరో సినిమాలో నటిస్తుంది అంటే మరో హీరో ఆమె డేట్స్ ఖాళీ అయ్యేవరకు కూడా వెయిట్ చేసేవారట. ఆమె కోసం ఎంత పెద్ద సినిమా అయినా వాయిదా వేసుకునే వారట. అంత క్రేజ్ ఉండేది సౌందర్యకి అప్పట్లో.

The star hero who held Soundarya legs

అయితే అలా అని రొమాన్స్ చేస్తుంది గ్లామర్ పాత్రల్లో నటిస్తుంది అంటే అదీ కాదు.ఎలాంటి గ్లామరస్ పాత్రల్లో నటించకుండానే సౌందర్య తన నటనతోనే అందర్నీ ఆకట్టుకుంది. అయితే అలాంటి సౌందర్యకు ఇండస్ట్రీలో హిట్ పెయిర్ గా వెంకటేష్ తో పేరుంది. అప్పట్లో ఈ జంటకి మంచి పేరు ఉండేది. వీరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. అంతే కాదు వీరి మధ్య కొన్ని ఎఫై** వార్తలు కూడా వినిపించినప్పటికీ అవి కేవలం రూమర్స్ అని బయటపడింది. (Soundarya)

Also Read: Mega family: పిఠాపురంలో మెగా హీరో పై బీరు సీసాతో దాడి.. ఆందోళనలో ఫ్యాన్స్..!

ఈ విషయం పక్కన పెడితే సౌందర్య వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన పవిత్ర బంధం సినిమా అందరూ చూసే ఉంటారు.అయితే ఈ సినిమాలో “అపురూపమైనదమ్మ ఆడజన్మ” అనే పాట సినిమా కంటే ఎక్కువ హైలైట్ అయింది. ఈ పాట ఎప్పటికీ ఎవర్గ్రీనే.అయితే ఈ పాట తర్వాత వెంకటేష్ సౌందర్య కాళ్లు పట్టుకునే సీన్ ఒకటి డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య చెప్పారట.కానీ ఈ విషయంలో సౌందర్య అస్సలు ఒప్పుకోలేదట.ఆ స్టార్ హీరో నా కాళ్లు పట్టుకోవడం ఏంటి గొడవలు అయిపోతాయి అని చెప్పిందట.

The star hero who held Soundarya legs

ఇక వెంకటేష్ కూడా మొదట్లో వద్దని చెప్పారట.ఎందుకంటే తన ఫ్యాన్స్ ఏ విధంగా తీసుకుంటారో అని. ఇ ఈ విషయంలో వెంకటేష్ ని సౌందర్యని దర్శకుడు బతిమిలాడేసరికి వాళ్ళు ఒప్పుకున్నారట.అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు వెంకటేష్ సౌందర్య కాళ్లు పట్టుకున్న ఒక పోస్టర్ ని రిలీజ్ చేయగా వెంకి అభిమానులు అందరూ ఆగ్రహానికి గురై హీరోయిన్ కాళ్లు మా హీరో పట్టుకోవడం ఏంటి అసలు ఈ సినిమాని ఎవరు చూడరు అంటూ పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారట.కానీ బలమైన కంటెంట్ ఉండడంతో ఈ మూవీ విడుదలయ్యాక మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి అతిపెద్ద సక్సెస్ అయ్యింది..(Soundarya)

Join WhatsApp