Did Rajinikanth become rich because of that dream

Rajinikanth: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వెట్టయాన్ అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలో భారీ తారాగణం ఉంటున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా కోసం రజినీకాంత్ రికార్డు రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తోంది. అలాగే ఈ మూవీ తెలుగులో కూడా వేటగాడు అనే టైటిల్ తో విడుదలవబోతుందట.ఇదంతా పక్కన పెడితే..రజినీకాంత్ ఇండస్ట్రీలోకి రాకముందు ఒక పేదవాడు..ఈ విషయం చాలామందికి తెలుసు.అలాగే ఈ విషయాన్ని రజినీకాంత్ కూడా ఎన్నో సందర్భాలలో బయటపెట్టారు.

Did Rajinikanth become rich because of that dream

అయితే ఓ రోజు అర్ధరాత్రి కల వచ్చాక ఆయన ధనవంతుడు అయ్యాడట. మరి ఇంతకీ రజినీకాంత్ వచ్చిన ఆ కల ఏంటో ఇప్పుడు చూద్దాం.. రజినీకాంత్ ఇండస్ట్రీ లోకి రాకముందు బస్ కండక్టర్ గా పని చేశారని చాలామంది అనుకుంటారు. అయితే కండక్టర్ పని చేసే కంటే ముందే ఆయన ఓ ఆఫీసులో ఆఫీస్ బాయ్ గా కూడా వర్క్ చేశారట.ఇక ఆయన తన పేదరికం తెలుసుకొని ప్రతిసారి బాధపడుతూ ధనవంతుడిని అవ్వాలి అని కోరుకునేవాడట. ఇక తనకి వచ్చిన కొన్ని కష్టాలను చూసి ఒకానొక సమయంలో సూసైడ్ కూడా చేసుకోవాలని భావించారట. (Rajinikanth)

Also Read: Meenakshi Chaudhary: బీచ్ లో వయ్యారాలు పోతూ ఫొటోస్ కి స్టిల్స్ ఇచ్చిన మీనాక్షి.. ఫొటోస్ వైరల్..!

కానీ వాటన్నింటినీ దిగమింగుకొని ముందుకు సాగారు. అయితే ఓ రోజు పడుకున్నాక అర్ధరాత్రి పూట ఆయన కలలో ఓ గుర్తుతెలియని వ్యక్తి తెల్ల గడ్డం వేసుకొని సంతర్వో నదికి అటు పక్కన కూర్చుని ఉన్న కల వచ్చిందట. అయితే అదే కలలో రజినీకాంత్ ఆయన దగ్గరికి నీళ్లు ఉన్నా సరే పరిగెత్తుకుంటూ వెళ్లారట. అయితే ఈ కల వచ్చాక తెల్లవారుజామున వెంటనే ఆ కల గురించి చెప్పగా ఆ కలలో కనిపించింది రాఘవేంద్ర స్వామి అని ఇంట్లో వాళ్ళు అన్నారట.

Did Rajinikanth become rich because of that dream

దాంతో అప్పటినుండి రాఘవేంద్ర స్వామి మీద భక్తి పెంచుకున్న రజినీకాంత్ ఓ మఠానికి వెళ్లి ప్రతి గురువారం ఉపవాసం ఉంటూ ఆ దేవున్ని తలుచుకొని తన కష్టాలన్నీ పోవాలి ధనవంతుడు అవ్వాలి అని కోరుకునేవారట.ఇక ఎప్పుడైతే రాఘవేంద్ర స్వామిని నమ్మడం మొదలు పెట్టాడో అప్పటినుండి రజినీకాంత్ దశ తిరిగిపోయిందట. అలా సినిమాల్లో కూడా అవకాశాలు రావడంతో ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీలో స్టార్ అయ్యి వందల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు. ఇక అప్పటినుండి రజినీకాంత్ రాఘవేంద్ర స్వామి భక్తుడిగా మారిపోయారట.(Rajinikanth)

Join WhatsApp